నేడు సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే జయంతి. ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
మహిళల అభ్యుదయానికి విద్యే నాంది అని దృఢంగా నమ్మి, సమాజపు కట్టుబాట్లను ధైర్యంగా ఎదుర్కొంటూ 1848లోనే పూణేలో దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించిన భారతదేశపు తొలి మహిళా గురువు సావిత్రి బాయి పూలే అని కొనియాడారు.
మహిళల అభ్యుదయానికి విద్యే నాంది అని దృఢంగా నమ్మి, సమాజపు కట్టుబాట్లను ధైర్యంగా ఎదుర్కొంటూ 1848లోనే పూణేలో దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించిన భారతదేశపు తొలి మహిళా గురువు, సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే గారు. నేడు ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/yoY1ivGYaF
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 3, 2026
ఇదిలా ఉంచితే, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. సావిత్రీబాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ మూర్తి, పలువురు బీసీ నేతలు హాజరయ్యారు.



