ఏపీ అభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయి: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Congratulate GMR Group Over Bhogapuram Airport, Check Out Post And News Video Went Viral | Sakshi
Sakshi News home page

ఏపీ అభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయి: వైఎస్‌ జగన్‌

Jan 4 2026 1:06 PM | Updated on Jan 4 2026 2:00 PM

YS jagan Congratulate GMR Group Over Bhogapuram Airport

సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావ‌డంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం వైఎస్సార్‌సీపీ హయాంలోనే అనుమతులు సాధించడం, ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్త‌యిందని చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావ‌డం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి.  #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం.

ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్త‌యింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది’ అని పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement