ప్రాణం తీయడం.. సినిమా స్టైల్‌గా మారిపోయింది..! | CCTV Footage Shows Exact Moment AAP Sarpanch Incident | Sakshi
Sakshi News home page

ప్రాణం తీయడం.. సినిమా స్టైల్‌గా మారిపోయింది..!

Jan 5 2026 10:33 AM | Updated on Jan 5 2026 11:42 AM

CCTV Footage Shows Exact Moment AAP Sarpanch Incident

ఇటీవల కాలంలో ఎక్కువగా గన్‌ కల్చర్‌ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. గన్‌ కల్చర్‌తో ప్రమాదమనే విషయం అమెరికాలోని వరుస కాల్పుల ఘటనలు మనకు కనువిప్పు కలిగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే గన్‌ కల్చర్‌ మనదేశంలో కూడా కనిపిస్తుంది. తాజాగా పంజాబ్‌ రాష్ట్రంలో ఆప్‌ సర్పంచ్‌ జర్మల్‌ సింగ్‌ను హత్య చేసిన విధానం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

ఓ పెళ్లి వేడుకకు హాజరైన జర్మల్‌ సింగ్‌ను ఇద్దరు యువకల ఇలా వచ్చి అలా కాల్చేసి వెళ్లిపోయారు.    వివాహ కార్యక్రమంలో భాగంగా పక్క ఊరికి వెళ్లిన సమయంలో ఇది చోటు చేసుకుంది. ఆ దుండగులు అక్కడకు వచ్చిన సమయంలో సర్పంచ్‌ జర్మల్‌ సింగ్‌ కూర్చొని ఉన్నారు. వెనుక నంచి జస్ట్‌ అలా కాల్చేయడం, ఆపై వెంటనే ఆయన కుప్పకూలిపోవడం జరిగిపోయాయి. 

ఆ హఠాత్తుపరిణామం నుంచి అక్కడున్న వారు తేరుకునే లోపే ఆ సర్పంచ్‌ ప్రాణం వదిలేశారు. ఆ దుండగులు పారిపోయారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డైన హత్యోదంతం ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది. ఇంత ఈజీగా ప్రానాలు తీసే సంస్కృతి ఇక్కడకు కూడా వచ్చేసిందా అనే భావన  ఆ వీడియోను చూస్తే అర్థమవుతుంది.

తంగ్‌ తారన్ జిల్లా వాల్టోహా గ్రామ సర్పంఛ్‌ చేస్తున్న జర్మల్ సింగ్‌ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పి చంపారు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన క్రమంలో  ఈ హత్య జరిగింది. అమృత్‌సర్ జిల్లా, వెర్కా బైపాస్ దగ్గర ఉన్న ఒక రిసార్ట్‌లో పెళ్లి వేడుకకు జర్మల్‌ సింగ్‌ హాజరయ్యారు. అయితే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెళ్లి అతిథుల్లా  లోపలికి వచ్చి, జర్మల్ సింగ్‌ను దగ్గర నుంచి కాల్చి చంపారుఆయన వేడుకలో పాల్గొంటున్న సమయంలో దాడి జరిగింది. తలకు బుల్లెట్ తగిలడంతో జర్మల్‌ సింగ్‌ మృతిచెందారు. 

కబడ్డీ ఆటగాడు కన్వర్ దివిజయ్ సింగ్ (రాణా బలాచౌరియా) హత్య జరిగిన కొన్ని వారాలకే చోటు చేసుకోవడం వల్ల రాష్ట్రంలో నేరాల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  అంతకుముందు మూడుదఫాలు జర్మల్‌ సింగ్‌ హత్యాయత్నం జరిగింది. అయితే ఈసారి జర్మల్‌ సింగ్‌ను అతి దగ్గరగా కాల్చి చంపడంతో ఆయన మృత్యువాత పడ్డారు. ఈ హత్య రాజకీయ ప్రత్యర్థిత్వం లేదా గ్యాంగ్‌స్టర్ సంబంధాలు కారణమా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement