
పండుగ పూట అసెంబ్లీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సిబ్బంది అంతా హుషారుగా వేడుకల్లో మునిగిపోయారు. కొందరు హుషారుగా చిందులేస్తుండగా.. మరికొందరి విజిల్స్, చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈలోపు ఊహించని రీతిలో విషాదం అలుముకుంది.
కేరళ శాసనసభలో ఓనం సంబరాల సందర్భంగా సోమవారం విషాదం నెలకొంది. డ్యాన్స్ గ్రూప్‌లో హుషారుగా చిందులేస్తూ ఓ సిబ్బంది.. అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఆసుపత్రికి తరలించినా, చేరిన కొద్దిసేపటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన్ని డిప్యూటీ లైబ్రేరియన్ వి. జునైస్ (46)గా పోలీసులు నిర్ధారించారు.
వయనాడ్‌కు చెందిన జునైస్ గతంలో మాజీ ఎమ్మెల్యే పీవీ అన్వర్ దగ్గర పీఏగా పని చేశాడు. 2011 నుంచి కేరళ శాసనసభలో సిబ్బందిగా పని చేస్తూ వచ్చాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నాయి. క్రీడలంటే ఇష్టమున్న జునైస్.. ఫిట్‌నెస్ కూడా ఉంది. అయితే ఈ మధ్యే ఛాతీ నొప్పికి చికిత్స తీసుకున్నట్టు బంధువులు తెలిపారు.
సోమవారం జరిగిన ఓనం ఈవెంట్స్‌లో టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్‌లో జునైస్ బృందం మొదటి బహుమతి గెలుచుకుంది. అయితే.. కాసేపటికే అలా డ్యాన్స్ వేస్తూ ఆయన కన్నమూయడం గమనార్హం. సిబ్బంది మృతితో శాసనసభలో జరిగాల్సిన ఓనం వేడుకలు తక్షణమే నిలిపివేశారు.
A 45-year-old man collapsed and died while dancing on stage during the Onam celebrations organised by the Kerala legislative assembly.
The deceased was identified as Junais, an assistant librarian who earlier worked as the personal assistant of former MLA PV Anwar.
He was… pic.twitter.com/dky9R6XPRP— Vani Mehrotra (@vani_mehrotra) September 2, 2025