ఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో జరిగిన 8 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపు సాధించాయి. తెలంగాణ, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాయి. తెలంగాణ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరాం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ నగ్రోటలో బీజేపీ అభ్యర్థి దేవయాని రానా గెలుపొందారు. బడ్గాంలో పీడీపీ అభ్యర్ధి సయ్యద్ ముంతజీర్ విజయం సాధించారు.
జార్ఖండ్‌లో ఘట్సిల ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి సోమేశ్ చంద్ర విజయం సాధించగా.. రాజస్థాన్‌లో అంట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ గెలుపొందారు. తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. పంజాబ్‌లో తరణ్ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హర్మిత్ సింగ్ సందు గెలుపొందారు. మిజోరాంలో డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా గెలుపొందారు. ఒడిశాలో నౌపడ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జై దొలాకియా విజయం సాధించారు.


