కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ధ్వజం
కృష్ణా జలాలపై కాంగ్రెస్ తప్పిదాలను ప్రజల ముందు పెడతాం
శీతాకాల సమావేశాలను 15 రోజులు నడపాలి
సాక్షి, హైదరాబాద్: అన్ని వ్యవస్థలను భ్రషు్టపట్టించిన కాంగ్రెస్ ప్ర భుత్వం శాసనసభను కూడా నిర్విర్యం చేసిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చకు బదులు ప్రతిపక్షంపై బురద జల్లడానికే కాంగ్రెస్ సమావేశాలు పెడుతోందన్నారు. అసెంబ్లీని నడపడానికి భయపడుతున్న ప్రభుత్వం తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహిస్తుందని వి మర్శించారు. ఆదివారం హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టి గా మాట్లాడారు.
బీఆర్‌ఎస్ హయాంలో తొలి దఫాలో ఏడాదికి సగటున 32 రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కలిపి 40 రోజులు మాత్రమే సభను నడిపిందన్నా రు. ఏడాదికి 45 రోజులు అసెంబ్లీ పెట్టాలని గతంలో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు 20 రోజు లకు పరిమితం చేయడం దారుణమన్నారు. శీతాకాల సమావేశాలను కనీసం 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఇచి్చన ఒక్క అంశంపైన కూడా చర్చ పెట్టకపోతే అసెంబ్లీ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.
కృష్ణా జలాల్లో అన్యాయం: పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన కృష్ణా జలాల వినియోగంపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 90 టీఎంసీలుగా ఉన్న కేటాయింపును 45 టీఎంసీలకు తగ్గించారని ఆరోపిస్తూ మంత్రి ఉత్తమ్ లేఖ రాశారా లేదా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ చేసిన తప్పిదాలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. 299 టీఎంసీలకు ఒప్పుకున్నది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసిందని తెలిపారు.
అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని, తమకంటే తక్కువ సభ్యులు ఉన్న పారీ్టలకు ఇద్దరు, ముగ్గురికి మైక్ ఇచ్చారని ఆరోపించారు. ఘోష్ కమిషన్ నివేదికపై తాను మాట్లాడుతుంటే ఏడుగురు మంత్రులు అడ్డుపడ్డారని చెప్పారు. మైక్ కట్ చేయకుండా తగిన సమయం ఇవ్వడానికి స్పీకర్ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎరువుల కొరత, రైతుబంధు ఆలస్యం, రుణమాఫీ, పంట బోనస్, ఐదు లక్షల కోట్ల ‘హిల్ట్ పాలసీ’ స్కాం జాబ్ కేలండర్, గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ తదితరాలపై చర్చ తప్పనిసరి అన్నారు.


