మార్చిలోనే మాడ్చేసేలా.. | march heat wave pushes power demand record 4421 mw greater hyderabad | Sakshi
Sakshi News home page

మార్చిలోనే మాడ్చేసేలా..

Mar 5 2026 9:27 AM | Updated on Mar 5 2026 9:27 AM

march heat wave pushes power demand record 4421 mw greater hyderabad

సాక్షి,  హైదరాబాద్‌: సాధారణంగా మే నెలలో రికార్డు కావాల్సిన విద్యుత్‌ డిమాండ్‌ అనూహ్యంగా ఈ నెల 3న (మంగళవారం) నమోదైంది. 2025 మే 6న రికార్డు స్థాయిలో 4,352 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదు కాగా, ఈ సారి ఏకంగా 4,421 మెగావాట్లు దాటింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వచ్చే నెలాఖరు నాటికి గ్రేటర్‌ రోజు సగటు విద్యుత్‌ డిమాండ్‌ 5వేల మెగావాట్లు దాటే అవకాశం లేకపోలేదు.

 ఒక్కసారిగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌తో సబ్‌స్టేషన్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫీడర్లు ట్రిప్పవుతూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయానికి కారణమవుతున్నాయి. ఏప్రిల్‌/మే మాసాల్లో ఎండ త్రీవత ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతుంటారు. సహజంగానే ఈ సమయంలో విద్యుత్‌ వినియోగం కూడా ఎక్కువగా జరుగుతుంది. కానీ.. ఇందుకు భిన్నంగా మార్చి మొదటి వారంలో ఎండలు మండుతున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement