సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం | Major accident averted for Secunderabad-Hisar Express train | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

Mar 5 2026 10:00 AM | Updated on Mar 5 2026 10:07 AM

Major accident averted for Secunderabad-Hisar Express train

సాక్షి,హన్మకొండ: సికింద్రాబాద్,హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు మరమత్తులు చేపట్టిన అనంతరం వేరే ఇంజన్‌తో సహా రైలును ఉప్పల్ రైల్వే స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చిన్న సమస్యను పరిష్కరించడానికి ఇంత జాప్యం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement