breaking news
Seven states
-
జీసీసీలపై రాష్ట్రాల ఫోకస్
న్యూఢిల్లీ: దేశీయంగా భారీ స్థాయిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటవుతున్నాయి. ఏడు రాష్ట్రాలు 2031 నాటికి 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన లక్ష్యంతో 1,380 జీసీసీల ఏర్పాటుకు దోహపడేలా ప్రత్యేక విధానాలను రూపొందించాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు.. విశిష్ట జీసీసీ పాలసీలను రూపొందించడంలో భారతీయ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అత్యంత అసాధారణమైన వేగాన్ని ప్రదర్శించాయని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. భారతీయ సరీ్వసుల వ్యవస్థకు జీసీసీలు ప్రధాన కేంద్రాలుగా మారుతుండటాన్ని ఇది తెలియజేస్తోందని వివరించారు. రాష్ట్రాలు నిర్దిష్ట ప్రోత్సాహకాలు, వేగవంతంగా అనుమతులు, దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాలను కల్పించే హామీలు మొదలైనవి కల్పించడం ద్వారా జీసీసీలను స్వాగతించేందుకు పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → కర్ణాటక 3.5 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే యోచనతో 500 జీసీసీలను టార్గెట్‌గా పెట్టుకుంది. మహారాష్ట్ర 4 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడేలా 200 జీసీసీలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. గుజరాత్ 50,000 ఉద్యోగావకాశాల కల్పనతో 250 జీసీసీలను, కేరళ 1.6 లక్షల కొలువు లక్ష్యంతో 80 జీసీసీలను టార్గెట్‌గా పెట్టుకుంది. అలాగే మధ్యప్రదేశ్ 37,000 ఉద్యోగాల కల్పన కోసం 50 జీసీసీలను సాధించాలని నిర్దేశించుకుంది. → జీసీసీ ఉద్యోగుల కోసం తమిళనాడు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. → తెలంగాణ, ఢిల్లీ కూడా జీసీసీ వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రోత్సహించే విధానాలను అమలు చేస్తున్నాయి. → ఈ పరిశ్రమ కోసం నిర్దిష్ట విధానాలను రూపొందించడంపై ఇతరత్రా పలు రాష్ట్రాలు దృష్టి పెడుతున్నాయి. కేరళ ముసాయిదా జీసీసీ పాలసీలను ప్రతిపాదించింది. → 2022 నుంచి 2026 తొలి ఆరు నెలల వ్యవధి మధ్య భారత్‌లోని టాప్ 9 నగరాల్లో జీసీసీలు 12.3 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. -
ఏడు రాష్ట్రాలు.. 8 ఉప ఎన్నికలు.. ఏ పార్టీలు గెలిచాయంటే?
ఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో జరిగిన 8 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపు సాధించాయి. తెలంగాణ, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాయి. తెలంగాణ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరాం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ నగ్రోటలో బీజేపీ అభ్యర్థి దేవయాని రానా గెలుపొందారు. బడ్గాంలో పీడీపీ అభ్యర్ధి సయ్యద్ ముంతజీర్ విజయం సాధించారు.జార్ఖండ్‌లో ఘట్సిల ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి సోమేశ్ చంద్ర విజయం సాధించగా.. రాజస్థాన్‌లో అంట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ గెలుపొందారు. తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. పంజాబ్‌లో తరణ్ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హర్మిత్ సింగ్ సందు గెలుపొందారు. మిజోరాంలో డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా గెలుపొందారు. ఒడిశాలో నౌపడ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జై దొలాకియా విజయం సాధించారు. -
7 రాష్ట్రాల్లో అబార్షన్ హక్కుల విజయం
వాషింగ్టన్: అబార్షన్ హక్కులు ఏడు రాష్ట్రాల్లో విజయం సాధించారు. అత్యంత నిర్బంధ గర్భస్రావం నిషేధాన్ని రద్దు చేయడానికి మిస్సోరి ఓటర్లు మార్గం సుగమం చేశారు. అరిజోనా, కొలరాడో, మేరీల్యాండ్, మోంటానాలో అబార్షన్ హక్కుల సవరణలు కూడా ఆమోదం పొందాయి. నెవాడా ఓటర్లు ఒక సవరణను ఆమోదించారు. అది అమల్లోకి రావాలంటే వారు దానిని 2026లో మళ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. ఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాల ఓటర్లు మాత్రం రాజ్యాంగ సవరణపై విముఖత వ్యక్తం చేశారు. అబార్షన్ నిషేధాన్ని రద్దు చేసిన రో వర్సెస్ వేడ్ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న చాలా రాష్ట్రాల్లో నిషేధాలు అమల్లోకి రావడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రస్తుతం 13 రాష్ట్రాలు కొన్ని మినహాయింపులతో గర్భధారణ అన్ని దశలలో నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆరు వారాలు, మరికొన్ని నాలుగు వారాల తరువాత గర్భస్రావాన్ని నిషేధించాయి. అబార్షన్ రాష్ట్రాలకు వదిలేయాల్సిన అంశమని రిపబ్లికన్ అభ్యరి్థగా పదేపదే చెప్పిన ట్రంప్... ఇప్పుడు అధ్యక్షుడిగా కార్యనిర్వాహక చర్య ద్వారా అబార్షన్ హక్కులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిషేధాన్ని ఎత్తేసిన మిస్సోరీ.. ఏ దశలోనైనా గర్భస్రావానికి హక్కును కలి్పస్తూ, అబార్షన్‌పై నిషేధాన్ని ఎత్తివేసే మొదటి రాష్ట్రంగా మిస్సోరి నిలిచింది. గర్భస్రావం, జనన నియంత్రణ, గర్భధారణ చుట్టూ నిర్ణయాలు వ్యక్తిగతమైనవని, వాటిని రాజకీయాలు కాకుండా వ్యక్తులకే వదిలేయాలనే హక్కులకు ఓటేసి మిస్సోరియన్లు చరిత్రను సృష్టించారు. మూడు రాష్ట్రాల్లో ఆంక్షలుఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాలు అబార్షన్‌పై నిషేధాన్ని సమరి్ధంచాయి. అబార్షన్ వ్యతిరేకులు బ్యాలెట్ పద్ధతిలో విజయం సాధించారు. ఫలితంగా రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిశాంటిస్‌కు రాజకీయ విజయం లభించింది. ఈ ఫలితం ఫ్లోరిడాలో, మొత్తం దేశానికి ఒక ముఖ్యమైన విజయమని జాతీయ గర్భస్రావ వ్యతిరేక గ్రూపు ఎస్బీఏ ప్రో–లైఫ్ అమెరికా అధ్యక్షుడు మార్జోరీ డాన్నెన్ఫెల్సెర్ ప్రకటించారు. కొన్ని మినహాయింపులు మినహా గర్భస్రావంపై నిషేధం ఉన్న మరో రాష్ట్రమైన సౌత్ డకోటా సైతం అబార్షన్ హక్కులకు వ్యతిరేకంగా ఓటేసింది. అబార్షన్ హక్కులను కల్పించే రాజ్యాంగ సవరణను నెబ్రాస్కా ఓటర్లు తిరస్కరించారు. ఆమోదం తెలిపిన ఏడు రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలు అబార్షన్ హక్కుల చట్ట సవరణకు ఆమోదం తెలిపాయి. గర్భం దాలి్చన మొదటి 15 వారాల తర్వాత అబార్షన్‌ను నిషేధించే ప్రస్తుత చట్టాన్ని సవరణకు అరిజోనా ఆమోదం తెలిపింది. గర్భస్రావ హక్కులను ఇప్పటికే అనుమతించిన మేరీలాండ్‌లో ఈ ఫలితాలు పెద్ద తేడాను చూపవు. మిస్సోరిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ గర్భస్రావం ఇప్పటికే చట్టబద్ధమైనది. కొలరాడోలో 55% ఓటర్లు అబార్షన్ హక్కులకు మద్దతును ప్రకటించారు. గర్భస్రావం కోసం రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ నిధులను ఉపయోగించడాన్ని నిషేధించిన గత సవరణను కూడా ఇది రద్దు చేయనుంది. స్టేట్ మెడికేడ్, ప్రభుత్వ ఉద్యోగుల భీమా పథకాలు గర్భస్రావాన్ని కవర్ చేసే అవకాశాన్ని కూడా ఇది కలి్పంచనుంది. న్యూయార్క్ సమాన హక్కుల చట్టం కూడా ఆమోదం పొందింది. ఇందులో ‘గర్భస్రావం’అనే పదం లేకపోయినా.. గర్భధారణ ఫలితాలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ, స్వయంప్రతిపత్తి ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఇది న్యూయార్క్ వాసులందరికీ గొప్ప విజయమని ఈక్వల్ రైట్స్ క్యాంపెయిన్ డైరెక్టర్ సాషా అహుజా ప్రకటించారు. -
రూ.1,500 కోట్లతో ‘నమామి గంగే’ ప్రారంభం
ఏడు రాష్ట్రాల్లో 231 ప్రాజెక్టులు షురూ న్యూఢిల్లీ/హరిద్వార్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామి గంగే పథకం అమలును పరుగులు పెట్టించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం గురువారం 231 ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల్లో ఏడు రాష్ట్రాల్లోని వంద ప్రాంతాల్లో రూ.1500 కోట్లతో మురుగుశుద్ధి కేంద్రాలు, ఘాట్లను నిర్మించనున్నారు. గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో భాగంగా గంగానది ప్రవహించే ఐదు (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్) రాష్ట్రాల్లోని 103 చోట్ల, గంగకు ఉపనదైన యమున ప్రవహించే ఢిల్లీ, హరియాణాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. హరిద్వార్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, ఉమాభారతి, మహేశ్ శర్మతోపాటు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ 43 ప్రాజెక్టులు ప్రారంభించారు. గంగానదిలో కాలుష్యానికి గతంలో సరైన ప్రణాళికల్లేకుండా ముందుకెళ్లటమే కారణమని.. మోదీ సర్కారు హయాంలో అలాంటి పొరపాట్లకు తావులేకుండా పనిపూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి తెలిపారు. నమామి గంగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ‘గంగా చట్టం’ తీసుకొస్తామన్న ఉమా.. పరిశ్రమలు వ్యర్థాలను గంగానదిలోకి విడుదల చేయకూడదని.. శుద్ధి చేసిన ఆ నీటి ని వ్యవసాయానికి వినియోగించాలన్నారు. గంగా స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహనకు అక్టోబరులో పాదయాత్ర చేపడతామన్నారు. ఈ ఏడాది చివరికల్లా 60 మురుగుశుద్ధి కేంద్రాలు ప్రారంభించనున్నట్లు గడ్కారీ తెలిపారు.


