సాక్షి, హైదరాబాద్: ‘మున్సిపల్ ఎన్నికలకు నన్ను లేకుండా చేసే కుట్ర ప్రభుత్వం చేస్తోంది’ అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను లోపల ఉన్నా.. పార్టీ చూసుకుంటుంది. బెదిరింపులకు తాను భయపడనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారన్నారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌లో డోర్స్ క్లోజ్ చేశామని.. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలిందని.. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 80 శాతం ఫలితాలు వచ్చాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు భయం మొదలైందని.. అందుకే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదని.. ఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోతున్నారంటూ కేటీఆర్ అన్నారు.


