వైఎస్‌ జగన్‌,వైఎస్సార్‌సీపీ అంటే చంద్రబాబుకు భయం : కురసాల | Kurasala Kannababu Fire On Chandrababu Over Chandrababu Cheap Politics in Assembly | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌,వైఎస్సార్‌సీపీ అంటే చంద్రబాబుకు భయం : కురసాల

Feb 25 2025 6:54 PM | Updated on Feb 25 2025 7:13 PM

Kurasala Kannababu Fire On Chandrababu Over Chandrababu Cheap Politics in Assembly

సాక్షి,కాకినాడ: ‘ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్‌సీపీదే. వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తన రంగు భయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అన్నా.. వైఎస్‌ జగన్‌ అన్నా భయమే.’ వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు.

ధన్యవాదాలు తీర్మానంలో సీఎం చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు.  సభా మర్యాదలు చూస్తే చిత్రంగా ఉంది. సభా మర్యాదలను మంట కలిపే శ్రీకారం చుట్టుంది చంద్రబాబే. ఎన్టీఆర్‌ను పదవి లోంచి దించే సమయంలో ఆయనకు మైక్ ఇవ్వలేదు.

మాజీ  గవర్నర్‌ నరసింహన్‌ చంద్రబాబును చూసి బిత్తరపోయారు. హరిచందన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు చంద్రబాబు ఏవిధంగా కించపరిచారో అందరికి తెలుసు. వీళ్లా సభలో వైఎస్సార్‌సీపీ గవర్నర్‌కు మర్యాద ఇవ్వలేదు అని అంటున్నారు. 

నిరనసగా వాకౌట్‌ చేసి వెళ్లి పోవడం చాలా కాలం నుంచి నడుస్తోంది. చాల పార్టీలు చేస్తున్నాయి. ధన్యవాదాలు తీర్మానంలో చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు.  ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రజలు ఏమీ అనుకుంటున్నారో తెలుసుకోండి. గ్రూప్-2 అభ్యర్ధులైతే..తాము తప్పు చేశామని చెప్పులతో కొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆబద్దాలు చెప్పారు.  రూ.7 లక్షల కోట్ల అప్పు అని తేలింది. ఒక అబద్దాన్ని జనంలోకి తీసుకు వెళ్లి దానిని నిజమని నమ్మిస్తారు. 

ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లు కూటమీ ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ అప్పులు దేని కోసం ఖర్చు చేశారు? ఏ వర్గాన్ని వదలకుండా మోసం చేయడానికి సిగ్గులేదా?. గవర్నర్‌తో   అబద్దాలు చెప్పించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెబుతున్నారు.వీసీలను రాత్రికి రాత్రి బెదిరించి రాజీనామాలను చేయించారు. దీనిపై విచారణ జరిపించండి. తొమ్మిది నెలల కాలంలో మీ అసలు రంగు బయట పడింది. ప్రతిపక్ష హోదా మీద పార్లమెంటు చట్టం ఏం చెప్పిందో తెలుసుకోండి.

వైఎస్సార్‌సీపీ అంటే మీకు భయం.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా మీ పాలనను ఎండగడతారని భయం. 151 సీట్లు వచ్చినా..11 సీట్లు వచ్చినా టీడీపీ వైఎస్‌ జగన్ చూసి భయపడుతోంది. ఆ ఒకే ఒక్కడు 49% ఓటు బ్యాంక్ పొందారు. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్‌సీపీదే అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement