సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో మరోసారి జాతీయ గీతం విషయంలో వివాదం చెలరేగింది. గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీని వదిలి వెళ్లారు. తన సంప్రదాయ ప్రసంగాన్ని చదివేందుకు నిరాకరించారు. ఇదే జాతీయ గీతం ఆలాపన విషయంలో వరుసగా మూడో సంవత్సరం కూడా ఇలాగే సభను వదిలి వెళ్లడం గమనార్హం.
చెన్నైలోని తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశం సందర్భంగా గవర్నర్ ఆర్.ఎన్. రవి సభలో ప్రవేశించారు. రాష్ట్ర గీతం అనంతరం జాతీయ గీతం వినిపించాలని ఆయన కోరారు. అయితే స్పీకర్ ఎం.అప్పావు అందుకు నిరాకరించారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం సమావేశం ముగిసిన తర్వాత జాతీయ గీతం మాత్రమే వినిపిస్తారని వివరణిచ్చారు. దీనిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రారంభించక ముందే సభను వదిలి వెళ్లిపోయారు.
అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ..‘జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదు. నేను చదవాల్సిన ప్రసంగంలో అనేక తప్పులు ఉన్నాయి. నా మైక్ ఆఫ్ చేశారు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది అవమానం అని అన్నారు. ఆయన ప్రసంగాన్ని చివరికి స్పీకర్ చదివి వినిపించారు. ఈ ఘటనపై డీఎంకే నేతలు గవర్నర్ తీరును తప్పుబడుతుంటే.. బీజేపీ వర్గాలు మాత్రం గవర్నర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. జాతీయ గీతానికి గౌరవం ఇవ్వకపోవడం తప్పు అని పేర్కొన్నారు.
జాతీయ గీలాపన విషయంలో గత మూడేళ్లుగా గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీ సంప్రదాయ ప్రసంగాన్ని చదవకుండా నిరాకరించారు. 2024, 2025 సంవత్సరాల్లో కూడా ఇదే కారణంతో ఆయన సభను వదిలి వెళ్లారు.
తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం వివాదం మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. గవర్నర్ రవి చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందనలు కలిసి సాంస్కృతిక గౌరవం, రాజ్యాంగ సంప్రదాయాలు, రాజకీయ విభేదాలు అన్న మూడు అంశాలను ముందుకు తెచ్చాయి. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాని పక్షంలో, రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తతకు గురయ్యే అవకాశం ఉంది.
Why TN #GovernorRNRavi R N Ravi walked out of the House without delivering Customary Address? #lokiBhavan says:
The speech contains numerous unsubstantiated claims and misleading statements. Several crucial issues troubling the people are ignored.
Full text.@lokbhavan_tn… pic.twitter.com/ICO3k4b3BN— Dr Velamur Govindarajan (@Govindarajan67) January 20, 2026


