ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై వాంగ్‌చుక్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Sonam Wangchuk 1st Reaction On Dharmendra Pradhan Resignation | Sakshi
Sakshi News home page

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై వాంగ్‌చుక్‌ ఫస్ట్‌ రియాక్షన్‌

Jul 25 2026 3:42 PM | Updated on Jul 25 2026 4:05 PM

Sonam Wangchuk 1st Reaction On Dharmendra Pradhan Resignation

ఢిల్లీ: ఇది ప్రజాస్వామ్య విజయం అని ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలన్నారు. ఇకపై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సీజేపీ,జెన్‌జీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  ఎక్స్ వేదికగా ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. విజయానికి సంకేతంగా 'వి' గుర్తును చూపుతున్న దృశ్యాన్ని ఆయన పంచుకున్నారు.

నీట్‌ లీకేజ్‌లపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనమ్‌ వాంగ్‌ చుక్‌ నిరహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని మరియు ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు.

అయితే, ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గత శనివారం(జులై, 18) ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిన ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన ఆయన దీక్ష విరమించారు. ఆయనకు మద్దతుగా కాక్రోజ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలై పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement