ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (66) ఘోరమైన విమాన ప్రమాదంలో మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రతింతిని రేపింది. అజిత్‌తో పాటు ఈ విమానంలోమరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్ కూడా చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ఎవరు వీరిద్దరూ అనే చర్య నెట్టింట్ తీవ్ర చర్చకు దారి తీసింది.
ఢిల్లీకి చెందిన చార్టర్ సంస్థ VSR నడుపుతున్న చార్టర్డ్ లియర్‌జెట్ 45 పూణే జిల్లాలోని బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్, తన వ్యక్తిగత భద్రతా అధికారి విదిత్ జాదవ్, అటెండెంట్ పింకి మాలితో కలిసి ప్రయాణిస్తున్నారు. వీరితోపాటు ఇద్దరు పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్ , కెప్టెన్ శాంభవి పాఠక్ సహా విమానంలో ఉన్న అందరూ మరణించారు. దీంతో శాంభవి , సుమిత్ కుమార్ అకాల మరణంపై సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.
Captain Shambhavi Pathak was flying the plane that crashed in Baramati, resulting in the tragic loss of all five individuals on board, including Maharashtra Deputy Chief Minister Ajit Pawar.
Her career was defined by a steady climb through the ranks of Indian aviation, from a… pic.twitter.com/ei9Hu8TAFe— Aarti (@aartic02) January 28, 2026
కెప్టెన్ శాంభవి పాఠక్
ఆర్మీ అధికారి కుమార్తె కెప్టెన్ శాంభవి పాఠక్ పైలట్-ఇన్-కమాండ్‌గా పనిచేస్తున్నారు. లియర్‌జెట్ 45 పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ శాంభవి పాఠక్ ఎయిర్ ఫోర్స్ బాల భారతి స్కూల్‌లో చదువుకున్నారు. తరువాత ముంబై విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి, ఏరోన్యూటిక్స్/ఏవియేషన్/ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో శిక్షణ పొందారు.
కెప్టెన్ సుమిత్ కపూర్
కెప్టెన్ సుమిత్ కపూర్ పైలట్-ఇన్-కమాండ్‌గా కూడా పనిచేస్తున్నారు , టేకాఫ్ , ల్యాండింగ్‌తో సహా క్లిష్టమైన దశలలో విమాన సిబ్బందిని నడిపించే బాధ్యతలను చాలా విజయవంతంగా చేపట్టారు.
ఇదీ చదవండి: అజిత్ పవార్ మరణంపై అనుమానాలు.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
మరోవైపు అనుభవం లేని పైలట్ వల్లే ప్రమాదం జరిగిందని వదంతులు వ్యాపించాయి. ఈ వందతులను ఏవియేషన్ అధికారులు ఖండించారు. ఇద్దరూ అనుభవజ్ఞులేనని స్పష్టం చేశారు.
విఎస్ఆర్ ఏవియేషన్ ఉన్నతాధికారి వికె సింగ్ మాట్లాడుతూ, ఇద్దరు పైలట్లు ఢిల్లీలో ఉన్నారని, వీరికి విమాన ప్రయాణ గంటల్లో విస్తృతమైన అనుభవం ఉందని చెప్పారు. కెప్టెన్ కపూర్‌కు 16,000 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉందని, కో-పైలట్‌కు సుమారు 1,500 గంటల అనుభవం ఉందని సింగ్ తెలిపారు. సహారా, జెట్‌లైన్, జెట్ ఎయిర్‌వేస్‌లో పనిచేశాడు. ఈ రకమైన విమానంతో చాలా అనుభవం ఉందని సింగ్ అన్నారు.
ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!
ఇద్దరూ కుటుంబ సభ్యుల్లాంటివారు
పైలట్లతో తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఇద్దరూ తనకు చాలా సన్నిహితులని సింగ్ అన్నారు. కెప్టెన్ సుమిత్ కపూర్ తనకు చాలా ప్రియమైన స్నేహితుడని అతని కుమారుడు కూడా తమతో పాటు పైలట్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. కెప్టెన్ శాంభవి నా బిడ్డ లాంటిది. వారిద్దరూ చాలా మంచి మనుషులు, చాలా మంచి పైలట్లు అంటూ వారి మృతికి సంతాపం తెలిపారు.
మరోవైపు 66 ఏళ్ల అజిత్ పవార్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాజకీయ సమావేశాలకు హాజరయ్యేందుకు వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చేతి గడియారం ఆధారంగా అజిత్ పవార్ మృతదేహాన్ని గుర్తించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది,వాతావరణ పరిస్థితులు, దృశ్యమానత, విమాన కార్యకలాపాలు, సాంకేతిక డేటాపై దృష్టి సారించింది.ఈ ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం దర్యాప్తు చేపట్టనుంది.
దర్యాప్తు జరిపిస్తాం
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించిన విమాన ప్రమాదంపై పారదర్శకంగా, జవాబుదారీగా విచారణ జరిపిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు వెల్లడించారు.అజిత్ దాదామనతో లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని మహారాష్ట్రకు తీరని లోటు. ఆయన లాంటి నాయకులను ఇక దొరకరంటూ కేంద్రమంత్రి సంతాపం వెలిబుచ్చారు. ఈ ఘటనలో మరణించిన మిగిలిన నలుగురి కుటుంబాలకు కూడా తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.


