నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణం యావత్ ప్రపంచం ఉలిక్కి పడేలా చేసింది. సహచరులతో కలిసి ప్రచారానికి బయలుదేరిన ఆయన బుదవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. లియర్‌జెట్ 45 విమానం (రిజిస్ట్రేషన్ VT-SSK) బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.
ఈ ఘోర విషాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మహాయుతి నుండి దూరం జరిగేందుకు యోచిస్తున్నారని, శరద్‌పవార్‌తో కలవడానికి ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో ఆయన మరణం వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇక్కడ ప్రజలకు ఎలాంటి భద్రత లేదు. నీ బీజేపీతో ఉండగానే ఇలా జరిగిందని, ఇక ప్రతిపక్ష పార్టీల గతి ఏమిటో అర్థం కాదని ఆమె విమర్శలు గుప్పించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ కావాలని డిమాండ్ చేశారు. ఇతర ఏ ఏజెన్సీపైనా తమకు నమ్మకం లేదని మమత వ్యాఖ్యానించారు.
Deeply shocked and stunned by the suddden demise of Ajit Pawar! The Deputy Chief Minister of Maharashtra and his co-passengers have died in a disastrous plane crash at Baramati today morning, and I am feeling a deep sense of loss.
My condolences to his family including his uncle…— Mamata Banerjee (@MamataOfficial) January 28, 2026
అజిత్ పవార్, మరో నలుగురు మృతి చెందిన విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మమతా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సీఎం మమతా బెనర్జీ బుధవారం డిమాండ్ చేశారు ఆయన మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా అజిత్ పవార్ మామ, శరద్ పవార్ సహా ఆయన కుటుంబానికి, పార్టీ శ్రేణులకు సంతాపాన్ని ప్రకటించారు.
అజిత్ పవార్ మృతిపై కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి బాధాకరమన్న కాంగ్రెస్ గౌరవ్ గోగోయ్.. ఘటనపై అనుమానాలు నెలకొన్నాయని.. పారదర్శకమైన దర్యాప్తుతో వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ ఎమ్మెల్యే(గోషామహల్) రాజాసింగ్ సైతం అజిత్ పవార్ మరణంపై స్పందించారు.
అజిత్ పవార్ చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి సడెన్ గా ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. మహారాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి ఆయన. కాబట్టి విమాన ప్రమాదం వెనక ఎమైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు సహజం. గత కొంతకాలంగా ఆయన అధికార నుంచి బయటకు పోతారనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే కుట్రలు కూడా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విమాన బ్లాక్ బాక్స్‌ను విశ్లేషిస్తే.. కుట్ర ఉందా లేదా తేలొచ్చు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
కాగా జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు వరుస ప్రజా ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించ డానికి పవార్ ముంబై నుండి తన స్వస్థలమైన బారామతికి బయలుదేరారు. ఈ విమానం దిగుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే థ్రెషోల్డ్ దగ్గర క్రాష్-ల్యాండ్ అయిందని డీజీసీఏ ప్రకటించింది. క్రాష్ ల్యాండింగ్ తర్వాత ఈ విమానం ముక్కలుగా విడిపోయింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో అనేక పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి DGCA అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి వెళుతున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. అజిత్ పవార్ అస్తమయంపై పలువరు రాజకీయ ప్రముఖకులు,ఇతరులు పలువురు తీవ్ర విచారం ప్రకటించారు.


