
సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం ఇటీవల కాలంలో భారీగా వేతనాలు ఆఫర్ చేసిన మెటా తన ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ల నుంచి 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. మెటా ప్రతినిధి తాజాగా ఈ పరిణామాలను ధ్రువీకరించారు. మెటా చీఫ్ ఏఐ అధికారి అలెగ్జాండర్ వాంగ్ నుంచి ఉద్యోగులకు అందిన అంతర్గత మెమోలో ఈ తొలగింపులను ప్రకటించారు.
ఈ ఉద్యోగ కోతలు మెటా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు, ఫండమెంటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్ (FAIR), ఇతర ఉత్పత్తి సంబంధిత కార్యకలాపాలను ప్రభావితం చేయనుందని కొందరు చెబుతున్నారు. అయితే ఈ తొలగింపులు మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లోని ఉద్యోగులను ప్రభావితం చేయవని చెప్పారు.
600 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న కంపెనీ నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉద్యోగాలు కూడా ఇకపై సురక్షితం కాదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు