ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ఎక్స్ భారతదేశంలో ప్రారంభించనున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల ధరలను అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడానికి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శాటిలైట్ ద్వారా నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించే ఈ ప్రీమియం సేవను భారతదేశ మార్కెట్లో త్వరలో మొదలు పెట్టనున్నారు.
ధరల వివరాలు
నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు: రూ.8,600. ఇది ప్రతి నెల సేవలను అందింస్తున్నందుకు వినియోగదారులు చెల్లించే రుసుం.
వన్-టైమ్ హార్డ్‌వేర్ కిట్ ఖర్చు: రూ.34,000. ఇది తొలిసారిగా చెల్లించాల్సిన పరికరాల ధర.
హార్డ్‌వేర్ కిట్‌లో ఏముంటాయి?
రూ.34,000 వన్-టైమ్ ఖర్చుతో వచ్చే ఈ కిట్‌లో శాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. దీనిని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు స్టార్‌లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సముదాయానికి కనెక్ట్ అవుతారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.
దీని లక్ష్యం..
భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఫైబర్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లు బలహీనంగా ఉన్న చోట ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం ద్వారా డిజిటల్ సర్వీసులు మెరుగుపరవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న వ్యాపారాలు డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించవచ్చు. వెనుకబడిన కమ్యూనిటీలకు ఆన్‌లైన్ విద్యను తీసుకురావడం ద్వారా విద్యా అవకాశాలను మెరుగవుతాయి.
మార్కెట్ సవాళ్లు
సాధారణంగా భారతదేశంలో సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు నెలకు రూ.500 నుంచి రూ.1,500 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్ నెలకు రూ.8,600 ధర వసూలు చేయడంతో ఎంతమేరకు సబ్‌స్క్రైబర్లు వస్తారనేది చూడాల్సి ఉంది.
ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?


