
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తమ 118వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పలు కొత్త ఆవిష్కరణలు, కార్యక్రమాలను ప్రకటించింది. వ్యాపార వర్గాల కోసం ఉద్దేశించిన వరల్డ్ బిజినెస్ యాప్, బాబ్ ఈ–పే ఇంటర్నేషనల్, ఇన్‌సైట్ బ్రెయిలీ డెబిట్ కార్డు, గ్రీన్ ఫైనాన్సింగ్ స్కీములు మొదలైనవి ఉన్నాయి.
టెక్నాలజీ ఆధారిత బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా సమ్మిళిత వృద్ధి సాధనలో బీవోబీలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. బ్యాంకింగ్ సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, లావాదేవీల నిర్వహణను సరళతరంగా, సురక్షితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని బీవోబీ ఎండీ దేబదత్త చంద్ తెలిపారు.
ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!
బ్యాంకు అందిస్తున్న జనరేటివ్ ఏఐ పవర్డ్ టూల్స్
అదితి: వీడియో, ఆడియో, చాట్ ద్వారా మల్టీ ల్యాంగ్వేజీలో 24/7 వర్చువల్ రిలేషన్ షిప్ మేనేజర్ సర్వీసులు అందిస్తుంది.
ఏడీఐ: తక్షణ సమస్యల పరిష్కారం కోసం జనరేటివ్‌ఏఐ ఆధారిత చాట్ బాట్.
గ్యాన్‌సహాహ్.ఏఐ(GyanSahay.AI): ఉద్యోగులు ప్రొడక్ట్, పాలసీ సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేయడానికి ఇంటర్నల్ జెఎన్ఏఐ ప్లాట్‌ఫామ్.