
ఓ మహిళా ఉద్యోగిని నియమించిన కొంత కాలానికి తన నియామకం చెల్లదని కంపెనీ తనను కొలువు నుంచి తొలగించింది. అందుకు నియామక సమయానికి ఆమెను గర్భిణిగా గుర్తించడమే కారణమని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వెలిసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌పామ్ టీమ్‌బ్లైండ్‌లో చేసిన ఓ పోస్ట్‌లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.
‘ఓ ప్రైవేట్ కంపెనీ ఒక మహిళా అభ్యర్థిని ఉద్యోగంలో నియమించుకుంది. బ్యాంక్‌గ్రౌండ్ వెరిపికేషన్‌లో ఆమె 6 నెలల గర్భిణి అని గుర్తించారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఉద్యోగానికి దరఖాస్తు చేయడం చట్టవిరుద్ధంగా కంపెనీ భావిస్తోంది. దాంతో తనను ఉద్యోగం నుంచి తొలగించి తిరిగి ఆ లెవల్-6 కొలువుకు మళ్లీ రిక్రూట్‌మెంట్ జరుపుతుంది’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఈ పోస్ట్ ఏ దేశంలోని ఉద్యోగి అప్‌లోడ్ చేశారో తెలియరాలేదు.
ఇదీ చదవండి: అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు
గతంలో ఇలాంటి వివక్షను ఎదుర్కొన్న ఒక ఉద్యోగి రిప్లై ఇస్తూ..‘నేను ఉద్యోగంలో చేరినప్పుడు 5 నెలల గర్భిణిగా ఉన్నాను. ఇప్పుడు కంపెనీలు చూపిస్తున్న చిన్నచూపు సరికాదు. నేను ఉద్యోగంలో చేరి ముందుకు సాగుతున్నాను. కంపెనీలో టాప్ ఎంప్లాయిల్లో ఒకరిగా ఉన్నాను. ప్రతి ప్రాజెక్ట్‌లోనూ నా నైపుణ్యాలు వాడుతారు. నేను చాలా మంది ఉద్యోగుల కంటే మెరుగ్గా సమస్యలకు పరిష్కారాలు అందిస్తాను. మహిళలు అభద్రతా భావానికి గురికావద్దు. పైన తెలిపిన పోస్ట్‌లో ఆమెను ఒక కారణం కోసం కంపెనీ నియమించుకుంది. దాన్ని మర్చిపోవద్దు’ అని రాసుకొచ్చారు.