మైక్రోసాఫ్ట్, యోటా జట్టు.. ఏఐ వినియోగానికి మరింత జోరు | Microsoft Yotta Partner to Boost AI in India | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్, యోటా జట్టు.. ఏఐ వినియోగానికి మరింత జోరు

May 29 2025 11:24 AM | Updated on May 29 2025 12:00 PM

Microsoft Yotta Partner to Boost AI in India

న్యూఢిల్లీ: భారత్‌లో కృత్రిమ మేథని (ఏఐ) మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్, యోటా డేటా సర్వీసెస్‌ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం యోటా ఏఐ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం అయిన శక్తి క్లౌడ్‌లో మైక్రోసాఫ్ట్‌ తమ అజూర్‌ ఏఐ సర్వీసులను అందుబాటులోకి తెస్తుంది.

దీంతో డెవలపర్లు, స్టార్టప్‌లు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండియాఏఐ మిషన్‌లో భాగమైన సంస్థలకు అధునాతన సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశీయంగా కృత్రిమ మేథ సామర్థ్యాలను పెంపొందించడం, నవకల్పనలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను పటిష్టపర్చడం ద్వారా ఇండియాఏఐ మిషన్‌ లక్ష్యాల సాధనకు కూడా మైక్రోసాఫ్ట్‌–యోటా భాగస్వామ్యం తోడ్పడనుంది.

👉ఇదీ చదవండి: టీసీఎస్‌లో భారీగా ఏఐ ఏజెంట్లు..

ఇండియాఏఐ మిషన్ అనేది దేశంలోని కృత్రిమ మేధ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ చొరవ. ఏఐ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం, స్వదేశీ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడం, పటిష్టమైన ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను సృష్టించడం ఈ మిషన్ లక్ష్యం. దేశీ ఏఐ మోడల్స్‌ను రూపొందించడానికి సంబంధించి 2025 మే నాటికి ఇండియాఏఐ మిషన్‌కు 500 పైగా ప్రతిపాదనలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement