
సాంకేతిక పురోగతి ఉపాధిని తొలగించేదిగా ఉండకూడదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. టెక్నాలజీ అనేది కార్మికులను గౌరవించి, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేలా, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా సమతుల్య విధానాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. బీఎంఎస్ ఆర్ఎస్ఎస్‌కు అనుబంధంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద కార్మిక సంఘం.
ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!
‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరివర్తన సవాలుగా మారుతోంది. ప్రతి కొత్త టెక్నాలజీ ప్రాథమికంగా ఆందోళన కలిగిస్తుంది. నాలెడ్జ్ బేస్డ్ టెక్నాలజీ సంబంధిత రంగంలోని ఉద్యోగాలపై ప్రభావం చూపకూడదు. దాని ప్రతిష్ఠను దిగజార్చకూడదు. మారుతున్న ఆర్థిక, సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా కార్మిక, పారిశ్రామిక, జాతీయ ప్రయోజనాలను సమన్వయం చేసేలా సాంకేతిక అభివృద్ధి ఉండాలి. ప్రతి ఆవిష్కరణలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మాన్యువల్ లేదా సెమీ స్కిల్డ్ లేబర్‌పై ఎక్కువగా ఆధారపడే రంగాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అన్నారు.