సరైన అర్హతలు, నైపుణ్యాల గుర్తింపు
రిక్రూటర్ల పని సులభతరం
లింక్డ్‌ఇన్ నివేదిక వెల్లడి
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) నియామకాల ప్రక్రియను మరింత సమర్థవంతం, సులభతరం చేస్తోంది. సరైన నైపుణ్యాలతో కూడిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం రిక్రూటర్లకు (నియామకాలు చేపట్టేవారు) సవాలు కాగా.. వీరు ఏఐ సాయాన్ని తీసుకుంటున్నారు. తమకు కావాల్సిన సరైన అర్హతలు, నైపుణ్యాలు దాగి ఉన్న అభ్యర్థులను గుర్తించేందుకు ఏఐ సాయపడుతున్నట్టు రిక్రూటర్లు లింక్డ్‌ఇన్ సర్వేలో భాగంగా తెలిపారు. ఒత్తిళ్ల మధ్య ఏఐని పరిష్కారంగా వారు భావిస్తున్నారు. 2025 నవంబర్ 13 నుంచి 28 మధ్య 19,113 మంది అభిప్రాయాలను, నవంబర్ 10 నుంచి 27 మధ్య 6,554 అంతర్జాతీయ హెచ్‌ఆర్ నిపుణులను లింక్డ్‌ఇన్ సర్వే చేసి వివరాలు విడుదల చేసింది.
→ గతంలో తాము గుర్తించలేని నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల నియామకానికి ఏఐ సాయపడుతున్నట్టు 71 శాతం మంది చెప్పారు.
→ అభ్యర్థుల నైపుణ్యాలను మరింత లోతుగా విశ్లేíÙంచేందుకు ఏఐ ఉకపరిస్తున్నట్టు 80 మంది పేర్కొన్నారు.
→ నియామకాలను ఏఐ వేగవంతం చేసిందని 76 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.
→ నియామకాలు కరోనా ముందునాటితో పోలి్చతే 40 శాతం పెరిగినా.. అర్హులైన అభ్యర్థులను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్టు 74 శాతం మంది రిక్రూటర్లు తెలిపారు.
→ ఏఐ ఆధారిత దరఖాస్తులు పెరిగినట్టు 53 శాతం మంది తెలిపారు.
→ కావాల్సిన నైపుణ్యాల్లో లోటు ఉంటున్నట్టు 47 శాతం రిక్రూటర్లు పేర్కొన్నారు.
→ తప్పుదోవ పట్టించే, తక్కువ నాణ్యత కలిగిన వాటి నుంచి నిజమైన దరఖాస్తులను వడబోయడంలో ఏఐ సాయపడుతున్నట్టు 48 శాతం మంది చెప్పారు.
→ 2026లోనూ ఇంటర్వ్యూల ముందస్తు స్క్రీనింగ్‌కు, వేగవంతమైన నియామకాలకు, మెరుగైన అభ్యర్థుల ఎంపికకు ఏఐని ఉపయోగించనున్నట్టు మెజారిటీ రిక్రూటర్లు తెలిపారు.


