
నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు ఇస్తారు.. ఇది వేతనం అనుకుంటే పొరపాటే. ఓ కంపెనీ ప్రకటించిన ఇంటర్న్‌షిప్ స్టైపెండ్! పుచ్ ఏఐ సహ వ్యవస్థాపకులు, సీఈఓ సిద్ధార్థ్ భాటియా తన ఎక్స్ ఖాతాలో ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. తన కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఖాళీలున్నాయని చెబుతూ.. అందుకు సంబంధించిన వివరాలను సైతం పబ్లిక్ డొమైన్‌లో ప్రకటించడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
సిద్ధార్థ్ భాటియా ఎక్స్‌లో తెలిపిన వివరాల ప్రకారం..‘మేం రిక్రూట్‌మెంట్ ప్రారంభించాం. లక్షల మందికి ఉపయోగపడేలా ఏఐని రూపొందించడానికి puch_ai కంపెనీలో చేరండి.
స్టైపెండ్: నెలకు రూ.1 లక్షల నుంచి రూ.2 లక్షలు
మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు చేరవచ్చు.
రిమోట్‌గా పని చేయవచ్చు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మరిన్ని వెసులుబాట్లు ఉంటాయి.
డిగ్రీ అవసరం లేదు.
మేము గత నెలలో ఒక హైస్కూల్ విద్యార్థిని నియమించుకున్నాం.
ఓపెన్ రోల్స్:
1. ఏఐ ఇంజినీరింగ్ ఇంటర్న్ (ఫుల్ టైమ్)
2. గ్రోత్ మెజీషియన్ (ఫుల్ టైమ్/పార్ట్‌టైమ్)
ఈ ఖాళీలపై ఆసక్తిగా ఉందా?
మేము మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలో.. మీరు పుచ్ ఏఐలో చేరితే దేనిపై పనిచేయడానికి ఇష్టపడుతారో కామెంట్ చేయండి. పర్‌ఫెక్ట్‌గా సరిపోయే వ్యక్తి ఎవరో తెలిస్తే వారిని నెటిజన్లు ట్యాగ్ చేయవచ్చు. ట్యాగ్ చేసిన వారిని నియమించుకుంటే ఐఫోన్ గెలుచుకుంటారు.
మేం కూడా హ్యాకథాన్ నిర్వహిస్తున్నాం. అందులో గెలిస్తే ఇంటర్న్‌షిప్ ఆఫర్ లభిస్తుంది. టాప్ 10లో చోటు దక్కించుకుంటే వ్యవస్థాపకులు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రిజిస్టర్ చేసుకోవాంటే http://puch.ai/hackathon పై క్లిక్ చేయండి’ అని రాసుకొచ్చారు.
🚨 We're Hiring! 🚨
Join @puch_ai to build AI for a Billion+ people.
💰 Stipend: ₹1L–2L/month
🗓️ Start: Whenever you're ready
📍 Remote
🚀 PPOs for top performers
🎓 No degree needed. We hired a high schooler last month.
Open Roles:
1. AI Engineering Intern (Full-time)
2.…— Siddharth Bhatia (@siddharthb_) August 6, 2025
ఈ పోస్ట్‌పై టెకీలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇప్పటికే కంపెనీ సీఈఓ వ్యాఖ్యలపై ఉద్యోగార్థులు తమ లక్ష్యాలను, ఇప్పటి వరకు తాము చేసిన పనిని వివరిస్తూ పోస్టులు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రత్యామ్నాయాలపై భారతీయ తయారీదారుల కన్ను
ఏఐ టాలెంట్ హంటింగ్..
కృత్రిమమేధ టూల్స్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో స్థాయితో సంబంధం లేకుండా దాదాపు చాలా టెక్ కంపెనీలు ఏఐ టాలెంట్ హంటింగ్ రేసులో పడ్డాయి. మెటా, ఎక్స్‌ఏఐ వంటి కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇచ్చి ఏఐ నిపుణులను నియమించుకుంటున్నాయి. చిన్న కంపెనీలు కూడా ఏఐ టాలెంట్‌ను వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. అందుకోసం విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నాయి.