
ఆధార్, యూపీఐ ఆవిష్కరణల్లో కీలకపాత్ర పోషించిన నందన్ నీలేకని భారత్‌లో కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉండబోతుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏఐ భారతదేశ జాబ్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు. అందుకు బదులుగా భారీగా సంపదను, అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. సాంకేతిక నిపుణులు ఏఐలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంతోపాటు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కోరారు.
ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఐ
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. ఈ ధోరణి ఇప్పటికే ప్రపంచ సాంకేతిక పర్యావరణ వ్యవస్థల్లో కనిపిస్తుంది. కానీ భారతదేశం అందుకు భిన్నమైన దృక్పథాన్ని నిర్మించాలి. ప్రపంచ శక్తులతో మనం పోరాడలేం. కానీ మన ప్రభావిత ప్రాంతంలో కోట్ల మంది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నూతన ఆవిష్కరణలు చేయాలి. ఉద్యోగం పోతుందని భయపడే బదులు నైపుణ్యాల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృత్రిమ మేధను ఉపయోగించాలి’ అని నీలేకని అన్నారు.