
చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ), డీ2సీ వ్యాపార సంస్థల కోసం ఈ–కామర్స్ సేవల సంస్థ షిప్‌రాకెట్ కొత్తగా ‘శూన్య.ఏఐ’ పేరిట ఏఐ ఇంజిన్‌ను ఆవిష్కరించింది. అల్ట్రాసేఫ్ సంస్థ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. తొమ్మిదికి పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్, ఇమేజ్ ఇంటెలిజెన్స్‌ను ఇది అందిస్తుందని పేర్కొంది. దీన్ని పూర్తిగా భారత్‌లోనే తీర్చిదిద్దినట్లు వివరించింది.
ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్‌ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీ
తొలి ఏడాదిలో ఇది 1 లక్ష పైచిలుకు ఎంఎస్‌ఎంఈలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షిప్‌రాకెట్ పేర్కొంది. కేటలాగింగ్, మార్కెటింగ్, ఫుల్‌ఫిల్‌మెంట్ తదితర విభాగాలవ్యాప్తంగా సమయాన్ని, డబ్బును ఆదా చేసుకునేందుకు శూన్య.ఏఐ ఉపయోగపడుతుందని కంపెనీ ఎండీ సాహిల్ గోయల్ చెప్పారు. షిప్‌రాకెట్, కేపీఎంజీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 11,000 పైచిలుకు బ్రాండ్లు ఉన్న దేశీ డీ2సీ మార్కెట్ ఈ ఏడాది (2025) 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అలాగే 22 కోట్ల ఆన్‌లైన్ షాపర్లున్న ఈ–రిటైల్ మార్కెట్ 125 బిలియన్ డాలర్లకు చేరనుంది.