ఆటోపాల్‌లో విలీనం ద్వారా బీఎస్‌ఈలో నమోదు
ఏఐ ఆధారిత గవర్నెన్స్, ఎంటర్‌ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్లు అందించే ఆర్‌ఎన్‌ఐటీ ఏఐ సొల్యూషన్స్ తాజాగా బీఎస్‌ఈలో లిస్టయ్యింది. ఈ సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలో కంపెనీ ఎండీ, సీఈవో రాజా శ్రీనివాస్ నందిగామ్ షేరు ఓపెనింగ్ బెల్ మోగించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ రివర్స్ మెర్జర్ ద్వారా బీఎస్‌ఈ మెయిన్ బోర్డులో లిస్టయ్యింది.
జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అనుమతించడంతో ఆర్‌ఎన్‌ఐటీ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ 2023లో ఆటోపాల్ ఇండస్ట్రీస్‌లో విలీనమైంది. విలీనం తదుపరి కంపెనీ ఆర్‌ఎన్‌ఐటీ ఏఐ సొల్యూషన్స్‌గా రూపాంతరం చెందింది. షేర్ల మార్పిడి తదుపరి తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈలో లిస్టయ్యింది. మల్టీమోడల్ ఏఐ, ఇంటిగ్రేటింగ్ టెక్ట్స్, వాయిస్, విజన్ అనలిటిక్స్‌పై ఇన్వెస్ట్ చేయడం ద్వారా గవర్నెన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్లలో పటిష్ట నిర్ణయాలకు వీలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఇదీ చదవండి: ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా


