
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు ప్రస్తుత ఉద్యోగుల స్థానాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థల్లోని క్లర్క్, మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో ఏజెంటిక్ ఏఐ పాగా వేసిందని సర్వీస్‌నౌ 2025 నివేదిక తెలిపింది. మానవులతో కలిసి పనిచేసే ఏజెంటిక్ ఏఐ పనులను ఆటోమేట్ చేయడమే కాకుండా పనిని ఎలా అంచనా వేయాలి.. మరింత సమర్థంగా ఎలా నిర్వహించాలో విశ్లేషించి అమలు చేస్తుంది.
నివేదికలోని అంశాలు
కంపెనీలు పేరోల్ క్లర్కులు, మేనేజర్ల స్థానంలో ఏఐ ఏజెంట్లను పూర్తిగా నియమిస్తున్నాయి.
సిస్టమ్ అడ్మిన్లు, కన్సల్టెంట్ల స్థానంలో కంపెనీలు ఏఐ టూల్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఏఐతో సంబంధం ఉన్న కాన్ఫిగరేటర్లు, ఎక్స్ పీరియన్స్ డిజైనర్లు, డేటా సైంటిస్టు పోస్టుల్లో కొత్తగా నియామకాలు చేపడుతున్నాయి.
2030 నాటికి తయారీ రంగంలో 8 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం చెందుతాయి.
రిటైల్‌లో 7.6 మిలియన్ ఉద్యోగాలు, ఉడ్యుకేషన్‌లో 2.5 మిలియన్ కొలువులు ప్రభావితం అవుతాయి.
టెక్ పరిశ్రమల్లో కొత్తగా 3 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయి.
భారత్‌లో 25% సంస్థలు కృత్రిమ మేధ అనుసరించేలా పరివర్తన దశలో ఉన్నాయి. ఈ విషయంలో సింగపూర్, ఆస్ట్రేలియా కంటే భారత్ ముందుంది.
13.5% టెక్నాలజీ బడ్జెట్లు ఇప్పటికే కృత్రిమ మేధకు కట్టుబడి ఉన్నాయి.
57% సంస్థలు ఏఐ సామర్థ్య లాభాలను నివేదించాయి.
ఏఐ రీడిజైన్ చేసిన వర్క్‌ఫ్లోల నుంచి 63% ఉత్పాదకత పెరిగింది.
సవాళ్లు ఇవే..
ఏఐ వినియోగం పెరుగుతున్నా 30% సంస్థలకు డేటా భద్రత ఆందోళనగా మారుతుంది.
టెక్ కంపెనీల్లోని 26 శాతం ఉద్యోగులకు ఏఐ భవిష్యత్తు నైపుణ్యాలపై అవగాహన లేదు.
కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధను ఏమేరకు నమ్మాలో ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’