చాట్‌జీపీటీ డౌన్‌ అయితే పరిస్థితేంటి? | if ChatGPT down due try alternatives | Sakshi
Sakshi News home page

చాట్‌జీపీటీ డౌన్‌ అయితే పరిస్థితేంటి?

Nov 19 2025 5:39 PM | Updated on Nov 19 2025 6:16 PM

if ChatGPT down due try alternatives

ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల్లో కీలక పాత్ర పోషించే క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare)లో ఇటీవల తలెత్తిన సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వెబ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విస్తృతంగా అంతర్గత సర్వర్ లోపాలు (Internal Server Errors) ఏర్పడటానికి ఇది దారితీసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ప్లాట్‌ఫామ్‌ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. యూఎస్‌, యూరప్, ఆసియాలో ఈ అంతరాయం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ అంతరాయం కారణంగా X (గతంలో ట్విట్టర్), స్పాటిఫై.. వంటి కీలక సేవలతో పాటు OpenAI ChatGPT సేవలు కూడా కొద్ది సమయం నిలిచిపోయాయి.

క్లౌడ్‌ఫ్లేర్ సమస్య కారణంగా ChatGPTని సందర్శించిన వినియోగదారులకు ‘దయచేసి ముందుకు సాగడానికి challenges.cloudflare.com అన్‌బ్లాక్ చేయండి’ అనే సందేశం దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో జనరేటివ్‌ ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న చాట్‌జీపీటీ(క్లాడ్‌ఫ్లెయిర్‌ ఇన్‌ఫ్రా వాడుతుంది) సర్వీసులు మధ్యంతరంగా నిలిచిపోతే పనులు సజావుగా సాగేందుకు ప్రత్యామ్నాయాలు చూద్దాం.

గూగుల్ జెమిని

గూగుల్ జెమిని అధునాతన మోడల్స్‌తో రూపొందించారు. గూగుల్‌ సెర్చ్‌కు రియల్ టైమ్ కనెక్షన్ కలిగి ఉంది. దీని కారణంగా ఇది ఎల్లప్పుడూ అప్‌డేటెడ్‌, రియల్‌టైమ్‌ సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది జీమెయిల్‌, డాక్స్‌, డ్రైవ్‌ వంటి గూగుల్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానం కలిగి ఉంటుంది.

ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ

క్లాడ్ ఏఐ సెక్యూరిటీ, కచ్చితత్వం, నైతిక ఏఐ మోడల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఇది long context documents నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది.

మైక్రోసాఫ్ట్ కోపైలట్

మైక్రోసాఫ్ట్ కోపైలట్ అంతర్లీనంగా చాట్‌జీపీటీలాగే అదే జనరేటివ్‌ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ 365 ఎకోసిస్టమ్‌లో(Word, Excel, PowerPoint, Outlook) ఇంటర్నల్‌గా ఉండే ఏఐ అసిస్టెంట్. మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫ్లోలో ఉన్నవారు కార్పొరేట్ పత్రాలను రూపొందించడానికి, డేటాను విశ్లేషించడానికి ఇది అనువైనది.

జాస్పర్ ఏఐ

జాస్పర్ ఏఐ ప్రొఫెషనల్ కంటెంట్ రూపొందించడంలో  ప్రత్యేకత కలిగి ఉంది. ఇది బ్లాగ్‌లు, కథనాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, మార్కెటింగ్ కాపీలు అందిస్తుంది. మార్కెటర్లు, బ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఇది తోడ్పడుతుంది.

ఇదీ చదవండి: డ్రైవర్‌ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement