వీడిన ఉత్కంఠ.. ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సుకు బిల్‌గేట్స్‌ | Bill Gates will attend India AI Summit | Sakshi
Sakshi News home page

వీడిన ఉత్కంఠ.. ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సుకు బిల్‌గేట్స్‌

Feb 17 2026 6:27 PM | Updated on Feb 17 2026 6:47 PM

Bill Gates will attend India AI Summit

ఢిల్లీ: భారత్‌ నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సుకు మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ హాజరుకాకపోవడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో బిల్‌గేట్స్‌ హాజరుకానున్నట్లు గేట్స్‌ ఫౌండేషన్‌ అధికార ప్రతినిధులు వెల్లడించారు. 

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఢిల్లీలో ‘భారత్‌ మండపం’లో ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తుంది. అయితే, ఈ సమ్మిట్‌ అధికారిక వెబ్‌సైట్‌ అతిథుల లిస్టులో బిల్‌గేట్స్‌ పేరు లేదు. కేంద్రం సైతం ఆయన్ను ఆహ్వానించే విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అందుకు  దుమారం రేపుతున్న ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ పేరు ఉండడమే కారణమని తేలింది. 

దీంతో సమ్మిట్ వెబ్‌సైట్‌లో గేట్స్ పేరు లేకపోవడం వల్ల ఆయనకు ఆహ్వానం రద్దయిందంటూ పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్‌ మీడియాలో సైతం వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఈ క్రమంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘బిల్ గేట్స్‌ ఫిబ్రవరి 19న  ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొని తన ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు’ అని వెల్లడించారు.

ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ పేరు.. 
తాజాగా అమెరికాలో బయటపడిన ఎప్‌స్టిన్‌ ఫైల్స్ వివాదం నేపథ్యంలో  బిల్‌గేట్స్‌ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌కు రష్యా మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని, ఈ కారణంగా సుఖవ్యాధులకు గురైన ఆయన.. తన భార్యకు అవి సంక్రమించకుండా వ్యాక్సిన్లు కూడా ఇచ్చేవారని బయటపడింది. ఈ వివాదం కారణంగానే తాను బిల్ గేట్స్‌కు విడాకులు ఇచ్చినట్లు.. ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ పేరు వెలుగులోకి వచ్చిన వేళ ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్‌ వెల్లడించారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా బిల్‌గేట్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement