వందేభారత్‌లో సడన్‌ ‘ఫ్రీ ట్రిప్’‌.. తేరుకోగానే రూ.36 వేలు చిల్లు! | Vande Bharat Express 12 People Trapped Inside | Sakshi
Sakshi News home page

వందేభారత్‌లో సడన్‌ ‘ఫ్రీ ట్రిప్’‌.. తేరుకోగానే రూ.36 వేలు చిల్లు!

Nov 17 2026 10:05 AM | Updated on Nov 17 2026 10:08 AM

Vande Bharat Express 12 People Trapped Inside

కాన్పూర్‌: బంధువులను రైలెక్కించి టాటా చెప్పి ఇంటికి వెళ్లిపోదామనుకున్నారు.. అయితే ఊహించని రీతిలో వారు కూడా అదే రైల్లో వారితోపాటు వెళ్లాల్సి వచ్చింది! ఇదేదో సరదా ప్రయాణమనుకుంటే పొరపాటే.. తిరిగొచ్చేసరికి వారి జేబులకు రూ.36 వేల చిల్లు పడింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ విచిత్ర ఘటన జరిగింది. వారణాసి-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.26 గంటలకు కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంది. 9.30 గంటలకు బయలుదేరింది. ఈలోగా బంధువులను సాగనంపేందుకు వచ్చిన 12 మంది ప్లాట్‌ఫామ్ టికెట్లు లేకుండానే రైలులోకి ఎక్కారు. రైలు కదిలేలోపు దిగిపోవచ్చని అనుకున్నారు. కానీ వారి ప్లాన్ బెడిసికొట్టింది.

వందేభారత్ ఆటోమేటిక్ తలుపులు మూసుకుపోవడంతో దిగే దారి లేకుండా పోయింది. దీంతో బంధువులకు వీడ్కోలు చెప్పాల్సినవారే వారితోపాటు ప్రయాణికులుగా మారిపోయారు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. రైలును ఆపాలని సిబ్బందిని వేడుకున్నా ప్రయోజనం లేకపోవడంతో కొందరు హంగామా చేశారు. దీంతో రైల్వే సిబ్బంది టూండ్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. అధికారుల ఆదేశాలతో ఉదయం 10.50 గంటలకు రైలును ఇటావా జంక్షన్‌లో నిలిపివేశారు. అక్కడ 12 మందినీ కిందకు దించి ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు.

అనంతరం ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున మొత్తం రూ.36 వేల జరిమానా విధించారు. డబ్బులు చెల్లించాక హెచ్చరించి వారిని వదిలేశారు. అనుమతి లేకుండా వందేభారత్ కోచ్‌లలోకి ఎక్కకూడదని ఉత్తర మధ్య రైల్వే పీఆర్వో శివమ్ శర్మ తెలిపారు. మొత్తానికి బంధువులకు టాటా చెప్పడానికి వెళ్లి.. తాము ఇటావా వెళ్లి, పైగా ప్రయాణ ఖర్చులూ చెల్లించుకోవాల్సి వచ్చింది! 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement