breaking news
Bil gates
-
ఇప్పుడు పుట్టి ఉంటే కచ్చితంగా ఆటిజం నిర్ధారణ అయ్యేది: బిల్‌గేట్స్
ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, గొప్ప దాత కూడా. అంతేగాదు ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన సినిమా 'సోర్స్ కోడ్' ఫిబ్రవరి 04న విడుదల కానుంది. ఇటీవల ఆయన వాల్స్ట్రీట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి చాల ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పుకొచ్చారు. తాను గనుక ఇప్పుడు పుట్టి ఉంటే.. కచ్చితం తనకు ఆటిజం నిర్ణారణ అయ్యేదని అన్నారు. అలా అనడానికి గల రీజన్ వింటే విస్తుపోతారు. .!.బిల్‌గేట్స్ తనకు చిన్నతనంలో ఆటిజం లక్షణాలను ఉన్నట్లు తెలిపారు. అయితే ఆ రోజుల్లో దాని గుర్తించగలిగే వైద్య పరిజ్ఞానం లేకపోవడంతో అదెంటో కూడా అప్పటి వ్యక్తులెవరకీ తెలిసే అవకాశం లేదన్నారు. తాను చిన్నప్పుడు చాలా నెమ్మదిగా ఉండేవాడినని అన్నారు. ప్రతిది తొందగా నేర్చుకోలేకపోవడం, ఎవరితో కలవకపోవడం వంటి ఆటిజం లక్షణాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మిగతా పిల్లలతో పోలిస్తే అంత చురుకైన వాడిని కాదు, పైగా అంత బాగా చదివే విద్యార్థిని కూడా కాదని చెప్పుకొచ్చారు. ఇక్కడ అలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తారన్నా.. దానిపైనే ఆ పిల్లవాడు ఈ సమస్యని అధిగమించడం అనేది ఉంటుంది. తన తల్లిందండ్రులు అలానే తన సమస్యను అర్థం చేసుకుని ప్రత్యేకంగా చూడకుండా సాధారణంగానే వ్యహరించేవారన్నారు. అలాగే తన ప్రవర్తన ఇబ్బందికరంగా మారకుండా తన బలహీనతలు, బలాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని అన్నారు. ముఖ్యంగా తనకు తగిన స్కూల్ ఏదో చెక్‌చేసి మరీ అందులో చేర్పించారన్నారు. అలాగే తన బిహేవియర్‌ని మార్చుకునేలా తగిన కౌన్సలర్ వద్ద ట్రీట్మెంట్ ఇప్పించారని చెప్పారు. అందువల్ల తాను ఈ రోజు ఆ సమస్యను అధిగమించి ప్రభావవంతంగా చదువుకోగలిగానన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి సమస్యను గుర్తించగలిగే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేంది. కానీ పిల్లలు ఆ సమస్యతోను అధిగమించలేకపోతున్నారు తల్లిదండ్రులకు అలాంటి పిల్లలతో మసులోకోవాలనే దాని గురించి అవగాహన ఉండటం లేదన్నారు. ఇక్కడ మిగతా పిల్లల్లా.. తన పిల్లవాడు చురుకుగా లేడన్న లోపంతో తల్లిదండ్రులే కుమిలిపోతున్నారు. ఇక పిల్లవాడికి ఎలా ధైర్యం చెప్పి వాడి లోపాన్ని సరిచేయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ముందు.. ఉన్న సమస్యను లేదా లోపాన్ని పూర్తిగా అంగీకరించాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి లోపల ఉన్న అంతర్గత శక్తిని తట్టి లేపేలా తల్లిదండ్రులుగా తగిన ప్రోత్సాహం ఇస్తే ఏ పిల్లవాడు ఆటిజం బాధతుడిగా జీవితాంత ఉండిపోడని అన్నారు. ఈ సమస్యను అవమానంగా భావించడం, సోసైటీలో చులకనైపోతామనే భయం తదితరాల నుంచి తల్లిందండ్రులు బయటపడాలి. వారు స్థైర్యం తెచ్చుకుని వారితో తగిన విధంగా వ్యవహరించి ఓపికగా మార్చుకోగలం అనే దానిపై దృష్టి సారించండి. ఇది జీవితం విసిరిని సవాలు లేదా టాస్క్‌గా ఫీలవ్వండి. గెలిస్తే మీ అంత గొప్పోడు ఎవ్వడూ లేడనే విషయం గుర్తెరగండి. అలాంటి చిన్నారుల్లోని బలాన్ని తట్టి లేపి, వారు పుంజుకునేలా ప్రోత్సహించండి. అంతే ఏ పిల్లవాడు ఆటిజం బాధితుడిగా మిగిలిపోడు. అద్భుతాలను సృష్టించే మేధావిగా, గొప్ప వ్యక్తిగా రూపుదొద్దుకుంటాడని అన్నారు. ఏ చిన్నారికైనా ఇల్లే ప్రథమ బడి, అదే జ్ఞానాన్ని సముపార్జించగల శక్తిని అందిస్తుందని చెబుతున్నారు బిల్‌గేట్స్.(చదవండి: భారత రాజ్యాంగ రచనలో పాల్గొన్న మహిళలు వీరే..!) -
ఆర్బిఐ గవర్నర్‌తో బిల్ గేట్స్ చర్చలు - ఫోటోలు వైరల్
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' ఈ రోజు (ఫిబ్రవరి 28) ముంబైలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గవర్నర్ 'శక్తికాంత దాస్'ని కలిసి విస్తృత చర్చలు జరిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆర్బిఐ ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. ఇందులో బిల్ గేట్స్, శక్తికాంత దాస్ కలసి ఉన్న ఫోటోలు ఉండటం కూడా చూడవచ్చు. మోస్ట్ పాపులర్ బిజినెస్ మ్యాన్ అయిన బిల్ గేట్స్ ఆరోగ్యం,విద్య, ఇతర రంగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి భారతదేశంలో ప్రత్యేక పర్యటనలో ఉన్నారు. ప్రపంచములోని ఇతర దేశాల మాదిరిగానే భారతదేశంలో వనరులు పుష్కలంగా యి, ప్రతి రంగంలోనూ భారతదేశంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎంతటి పెద్ద సమస్యలనైనా ఒకేసారి ఎదుర్కొనే సత్తా భారతదేశానికి ఉందని, అనే విషయాల్లో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించగలదని కూడా బిల్ గేట్స్ ఇండియాను కొనియాడారు. భారత్‌ను చూస్తే భవిష్యత్తుపై ఆశ కలుగుతోందని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమయినప్పటికీ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే పనులెన్నో చేయగలుగుతోందని ఇటీవల గొప్పగా ప్రశంసించారు. Mr.@BillGates visited RBI Mumbai today and held wide ranging discussions with Governor @DasShaktikanta #RBI #rbitoday #rbigovernor #shaktikantadas #BillGates pic.twitter.com/WKOsxzcgHi — ReserveBankOfIndia (@RBI) February 28, 2023 -
బిల్‌గేట్స్ చిన్న కుమార్తెపై జాతి విద్వేష కామెంట్లు.. అసభ్య వ్యాఖ్యలు
కొద్ది రోజులుగా అమెరికాలో జాతి విద్వేష వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా అపర కుబేరుడు బిల్ గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్‌ల కుమార్తె ఫోబ్ గేట్స్‌కు సైతం ఆ వేధింపులు తప్పలేదు. ఇటీవలే ఆమె సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటోను షేర్ చేయటంతో జాతి విద్వేష వేధింపులకు గురయ్యారు. ఆ తర్వాత ఆ ఫోటోను డిలీట్ చేశారు ఫోబ్ గేట్స్. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ నల్లజాతి యువకుడు తన బుగ్గపై ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేశారామె. దీంతో ఆ ఫోటోను ట్రోల్ చేస్తూ ఆమెపై జాతి విద్వేష వేధింపులకు పాల్పడ్డారు పలువురు నెటిజన్లు. ఇరువురిపై జోక్స్ పేల్చారు. 'ఈ సంబంధాన్ని అంతం చేయడానికి బిల్ గేట్స్ సరికొత్త వైరస్‌ని తయారు చేయబోతున్నారు. అసలే వాతావరణ సంక్షోభం విపరీతంగా పెరిగిపోయింది. ఈక్రమంలోనే బిల్‌గేట్స్ కుమార్తె బొగ్గును స్వీకరించేందుకు సిద్ధపడిందా' అంటూ ఓ నెటిజన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. 'బిల్‌గేట్స్ తన కుమార్తెను తిరస్కరిస్తారా లేదా ప్రేమ అంటే కేవలం ప్రేమే అనే వాస్తవాన్ని ఒప్పుకుంటారో చూడాలి. ఒక వ్యక్తి వ్యతిరేకించేవారు.. వారి కుటుంబంలోకి రావటం హాస్యాస్పదంగా ఉంది. ఫోబ్ గేట్స్ కోసం ఇది జరుగుతుందని నమ్ముతున్నా. లవ్ లవ్' అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. You think the racist, republican extremist, Grifters/conspiracy theorist hated @BillGates before …..Wait till they get a load of Phoebe Gates life choices. pic.twitter.com/HPmEZ3tN6b — Popitics (@Popitics1) July 6, 2022 ఫోబ్ గేట్స్.. 2002, సెప్టెంబర్ 14న వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లో జన్మించారు. బిల్ గేట్స్, మిలిందా గేట్స్ దంపతుల ముగ్గురు పిల్లల్లో ఆమె చిన్న కూతురు. 2021, మే 4న బిల్ గేట్స్, మిలిందాలు తమ 27 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ట్విట్టర్ వేదికగా తమ విడాకుల విషయాన్ని ఇరువురు తెలిపారు. -
అసహ్యం వేస్తుంది..కేరక్టర్ మంచిది కాదు!! బిల్‌గేట్స్ పై మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న 2019 ఆగస్ట్‌లో మాన్‌హట్టన్ జైలు గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ ఎప్‌స్టిన్‌ను ఎందుకు కలుసుకున్నారో చెప్పాలని మండిపడ్డారు. అంతేకాదు బిల్ గేట్స్ నుంచి మీరు విడిపోవడానికి ఎప్స్టీన్తో రిలేషన్షిప్ ప్రధాన కారణమా? అని ప్రశ్నించగా.. అనేక కారణాలలో ఇది కూడా ఒకటి అని బదులివ్వడం ఆసక్తికరంగా మారింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఎప్‌స్టిన్‌ను బిల్ గేట్స్ ఎందుకు కలుసుకునేవారు. ఇదే విషయాన్ని బిల్‌గేట్స్ అడిగితే కారణాలు చెబుతారు. అందుకే నేనే అతనెవరు? అతని గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. ఓ సారి అతన్ని కలిశాను. కలిసిన తరువాత అనిపించింది. నేను ఎప్స్టిన్ ఎందుకు కలిశానా' అని చింతించాను. ఇక ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకొని, ఆయన్ని చూస్తుంటే అసహ్యం వేసేది. మంచి వ్యక్తిత్వం కాదని అభివర్ణించింది. ఇక ఇంటర్వ్యూలో..జెఫ్రీను కలవడం మీరు(మిలిందా) బిల్‌గేట్స్ విడాకులు తీసుకోవడానికి కారణం అయ్యిందా? అని జర్నలిస్ట్ అడిగినప్పుడు.. మేమిద్దరం విడిపోవడానికి అనే కారణాలున్నాయి. అందులో ఇదొకటి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బిల్, మిలిండాలకు ఆగస్టులో విడాకులు మంజూరు కాగా..ఎప్స్టీన్తో గడిపి తాను చాలా పెద్ద తప్పు చేశానని సీఎన్ఎన్తో గేట్స్ అన్నారు. కానీ, తన ఫౌండేషన్‌కు నిధుల సేకరణే లక్ష్యమని చేసిన వ్యాఖ్యాల్ని మిలిందా ఈ సందర్భంగా గుర్తు చేశారు. చదవండి: గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’.. -
బిల్‌గేట్స్ పేరెత్తితే ఆనంద్ మహీంద్రాకి చిరాకు.. కారణం ఇదే?
Padma Bhushan Anand Mahindra Life Story In Telugu: సోషల్ మీడియాలో ఏదైనా వీడియో బాగా పాపులర్ అయితే అది వెంటనే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా అకౌంట్లో ప్రత్యక్షం అవుతుంది. సామాజిక అంశాల మొదలు స్పోర్ట్స్ ఈవెంట్స్ వరకు అన్నింటిపైనా ఆయన స్పందిస్తుంటారు. లక్ష కోట్ల రూపాయల బిజినెస్ నడిపించే వ్యక్తిగా ఆయన అసలే కనిపించరు. కారణం .. ఆయనకు సినిమాలంటే పిచ్చి.. సినిమాల్లోకి రావాలని హర్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. కానీ పరిస్థితులు అనుకూలించక తిరిగి కుటుంబ బిజినెస్లోకే వచ్చారు. స్టీలు, ట్రాక్టర్లు , జీపులు తయారు చేసే కంపెనీ కంప్యూటర్స్, ఎయిరోస్పేస్ వరకు తీసుకెళ్లారు. అతని సేవలను గుర్తించిన కేంద్రం ఇటీవల ఆనంద్ మహీంద్రాని పద్మభూషణ్‌తో సత్కరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా వ్యాపార సామ్రాజ్యానికి మూడో తరం వారసుడు ఆనంద్ గోపాల్ మహీంద్రా. 1953లో హరీష్ , ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. తమిళనాడులో స్కూలింగ్ పూర్తి చేసిన ఆనంద్ మహీంద్రా.. సినిమాలపై ఉన్న మక్కువతో 1977లో హర్వర్డ్ యూనివర్సిటీలో ఫిల్మ్‌మేకింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత మనసు మార్చుకుని తిరిగి వ్యాపారం వైపు మొగ్గు చూపారు. దీంతో అదే యూనివర్సిటీ నుంచి ఎంబీఏలో మాస్టర్స్ చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. వ్యాపార మెళకువలు 1980వ దశకంలో స్టీలు వ్యాపారంలో జపాన్ గుత్తాధిపత్యం చెలాయిస్తుండేది. ప్రపంచంలో మరే దేశంలో మరే కంపెనీ జపాన్ సంస్థల ముందు నిలబడలేవు అనే పరిస్థితి ఉండేది. ఆ సమయంలో ముంబైలో ఉన్న మహీంద్రా ఉజిన్ స్టీల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఫైనాన్స్) ఆఫీసరుగా 1981లో చేరారు. అక్కడే ఉంటూ . జీపులు, ట్రాక్టర్లు, స్టీలు వ్యాపారాల నుంచి మహీంద్రా గ్రూపుని ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాలకు విస్తరించారు. వ్యాపారంలో ఒక్కో మెళకువను ఒంటబట్టించుకుంటూ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు ఆనంద్‌లో ప్రతిభకు పరీక్ష పెట్టేందుకు మరో సవాల్‌ని ఆయన ముందు ఉంచారు తాత జగదీశ్చంద్ర. తొలి పరీక్ష సమ్మెలతో అట్టుడికి పోతున్న కండివాలీ ఫ్యాక్టరీ బాధ్యతలు 1991లో మహీంద్రాకు అప్పగించారు. ఆనంద్ పదవీ బాధ్యతలు స్వీకరించడమే ఆలస్యం ఫ్యాక్టరీలో మరోసారి పెద్ద సమ్మెకు పిలపునిచ్చారు కార్మికులు. ఫ్యాక్టరీలో తీవ ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఆనంద్ మహీంద్రా క్యాబిన్ని చుట్టుముట్టి గట్టిగా నినాదాలు ఇస్తున్నారు కార్మికులు. ఏ కొంచెం తేడా వచ్చినా యజమానిపై దాడి తప్పదు అనేంత భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా దాడి జరగవచ్చని.. ఫ్యాక్టరీ వదిలి వెళ్లాలంటూ నలువైపుల నుంచి సలహాలు వస్తున్నాయి. అప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నారు ఆనంద్ మహీంద్రా. నేరుగా రంగంలోకి ఈ విపత్కర పరిస్థితుల్లో కార్మికులతో స్వయంగా చర్చలకు దిగారు ఆనంద్. మీ డిమాండ్లు ఒప్పుకోవాలన్నా.. దీపావళికి బోనస్‌లు ఇవ్వాలన్నా ఈ స్ట్రైక్‌ని ఇక్కడితో ఆపేసి పనిలోకి వెళితే మంచిది లేదంటే అంతే సంగతులు అంటూ ఖరాఖండీగా చెప్పారు. ఒక్క మాట అటు ఇటు అయితే భౌతిక దాడులకు అవకాశం ఉన్న చోట ఎంతో ధైర్యంగా కంపెనీ పరిస్థితులు, తన చేతిలో ఉన్న అవకాశాలను కార్మికులకు వివరించారు. అప్పటి వరకు కార్మికులతో మధ్యవర్తులే మాట్లాడే వారు.. సమస్య పరిష్కారం కాకుండా సుదీర్ఘకాలం సాగదీసేవారు. ఆ సంస్కృతికి భిన్నంగా యజమానే స్వయంగా రంగంలోకి దిగడం. తనకు ఏం కావాలో.. తనేం చేయగలడో నేరుగా చెప్పడంతో కార్మికులకు కొత్తగా అనిపించింది. ఆనంద్ మహీంద్రా మాట గౌరవించి పనిలోకి వెళ్లారు. గత కొన్నేళ్లుగా చచ్చీ చెడీ యాభై శాతం ఉత్పత్తి మాత్రమే సాధించే ఆ ఫ్యాక్టరీ.. ఆనంద్ వచ్చాక ఆ ఏడాది 150 శాతం ఉత్పత్తిని సాధించింది. ఈ ఘటనతో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వ్యాపార సామ్రాజ్యం, అందులోని ఉద్యోగుల భవిష్యత్తుకి ఆనంద్ రూపంలో భరోసా లభించింది. తెగింపుకి తొలిమెట్టు దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వాహన తయారీ టెక్నాలజీ కోసం ఇప్పటికీ విదేశీ కంపెనీలపైనే ఆధారపడుతున్నాయి. ఈ పరంపరలోనే ఫోర్డ్ కంపెనీతో కలిసి ఎస్కార్ట్ కారుని మార్కెట్లోకి తెచ్చారు ఆనంద్ మహీంద్ర. తొలి ప్రయత్నం దారుణంగా విఫలమైంది. ఆనంద్ సామర్థ్యంపై నీలినీడలు కమ్మకున్నాయి. కానీ ఈ అపజయాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నారు ఆనంద్. ఆ ప్రాజెక్టులో పని చేసిన 300 ఇంజనీర్లు, ఇతర సభ్యులతో సొంతంగా టీమ్‌ని తయారు చేశారు. దేశీయంగా ప్యాసింజర్ వెహికల్ తయారీ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు ఆనంద్ మహీంద్రా. ఆ రోజుల్లో ఆ ప్రయత్నం ఆత్మహత్యాసదృశ్యమే. అనేక నిద్రలేని రాత్రులు ఆ టీం గడిపింది,. స్కార్పియో సంచలనం మహీంద్రా టీం చేసిన కృషితో దేశీ టెక్నాలజీతో స్కార్పియో మార్కెట్లోకి వచ్చింది. ఆ కారు సక్సెస్ ఇండియా మార్కెట్‌నే కాదు ప్రపంచ మార్కెట్‌నే మార్చేసింది. అప్పటి వరకు విదేశీ టెక్నాలజీపై ఆధారపడిన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చుక్కానిలా పని చేసింది. యూరప్, ఆఫ్రికా దేశాల్లో సైతం స్కార్పియో వాహనాల అమ్మకాలు దుమ్ము రేపాయి. ఆ రోజుల్లో యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో టాటా మోటార్స్ మార్కెట్ వాటా 4.9 శాతం ఉంటే స్కార్పియో వాటా ఏకంగా 36 శాతానికి పెరిగింది. అదే ఒరవడిలో తర్వాత మహీంద్రా నుంచి జైలో ఎక్స్‌యూవీ సిరీస్, కేయూవీ సిరీస్‌లతో పాటు ఆఫ్‌రోడ్‌లో సంచలనం సృష్టిస్తున్న థార్ వంటి వెహికల్స్ వచ్చాయి. మహీంద్రా దూకుడు దేశీ టెక్నాలజీ తయారైన స్కార్పియో విజయం ఆనంద్ మహీంద్రాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. దీంతో మహీంద్రా గ్రూపు కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా మహీంద్రా లోగోలో రైస్‌ని చేర్చి మహీంద్రా రైస్ అంటూ కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. స్వరాజ్ ట్రాక్టర్స్, పంజాబ్ ట్రాక్టర్స్, గుజరాత్ ట్రాక్టర్స్, రేవా ఎలక్ట్రిక్ కార్ వెహికల్స్, సత్యం కంప్యూటర్స్, ప్యూజియోట్ మోటార్ సైకిల్స్, సాంగ్యాంగ్ మోటార్ సైకిల్స్ తదితర కంపెనీలను వేగంగా కొనుగోలు చేసి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుని విస్తరించారు. ఎయిరోస్పేస్లోకి కూడా అడుగు పెట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాక్టర్ల తయారీ కంపెనీ మహంద్రానే. మహీంద్రా విస్తరణ మహీంద్రా గ్రూపులో 1991లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పుడు కంపెనీ విలువ రూ.1,520 కోట్లు ఉండగా ముప్ప ఏళ్లలో 60 రెట్లు పెరిగి 2020 వచ్చే సరికి రూ. 96,241 కోట్లకు చేరుకుంది. పలు అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు , గౌరవ పదవులు చేపట్టారు. బిల్‌గేట్స్ పేరు ఎత్తితే చిరాకు ఆనంద్ మహీంద్రా భార్య పేరు అనురాధ. ఆమె జర్నలిస్టుగా పని చేస్తున్నారు. వెర్వే, మెన్స్ వరల్డ్ అనే పత్రికల నిర్వహిస్తున్నారు. ఆయనకు దివ్య, ఆలిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హర్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో బిల్‌గేట్స్, ఆనంద్ మహీంద్రా ఇద్దరు క్లాస్మేట్స్. బయట తాను ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా తన కూతుళ్లకు మాత్రం ఫెయిల్యూర్ పర్సన్లానే కనిపిస్తుంటానని ఆనంద్ మహీంద్రా అంటున్నారు. అందుకు కారణం ఆయన కూతుళ్లెవాళ్లెప్పుడు బిల్‌గేట్స్‌తో నన్ను పోలుస్తూ ‘నువ్వో ఫెల్యూయర్ పర్సన్’ అని ఆటపట్టిస్తుంటారు. అందుకే నాకు బిల్‌గేట్స్ పేరు వింటేనే కోపం వస్తుందంటూ సరదగా తన కుటుంబ విశేషాలను మీడియాతో ఆయన పంచుకున్నారు. సామాజిక సేవలో వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన తర్వాత సామాజిక సేవల్లోకి వచ్చారు ఆనంద్ మహీంద్ర. సామాజిక సేవ కోసం నాంది ఫౌండేషన్ స్థాపించారు. అందులో ఆయనకు ఎక్కువ సంతృప్తి ఇచ్చింది చదువుకు దూరమైన పేద బాలికల కోసం చేపట్టిన నహీ కాలీ ప్రాజెక్టు. 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 3.30 లక్షల మంది ఆడ పిల్లలకు ఈ ప్రాజెక్టు ద్వారా విద్య అందుతోంది. A matter of great happiness to see my good friend @anandmahindra get the Padma Bhushan. He has led the Mahindra group ably and ethically and more importantly always had India’s interest beating in his heart. pic.twitter.com/GCFzCW9VeA — Harsh Goenka (@hvgoenka) November 8, 2021 ఆనంద్ గోపాల్ మహీంద్రా ఘనతలు - భారత ప్రభుత్వం నుంచి 2021 నవంబర్ 7న పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. - ఫార్చూన్ మ్యాగజైన్ 2014లో ప్రకటించిన వరల్డ్ గ్రేటెస్ట్ లీడర్స్ -50లో చోటు దక్కించుకున్నారు. - ఫార్చూన్ ఆసియా మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ పీపుల్ 25లో స్థానం పొందారు - ఫోర్బ్స్ పత్రిక 2013లో ఎంట్రప్యూనర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు విశేషాలు - 1945లో ముహమ్మద్, జగదీశ్ చంద్ర మహీంద్రాలు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ఎం అండ్ ఎం పేరుతో కంపెనీ నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓవర్ లాండ్ అనే యూరప్ కంపెనీతో కలిసి ఆర్మీకి జీపులు తయారు చేసే పని దక్కించుంది. - దేశ విభజన సమయంలో ఈ సంస్థలో భాగస్వామిగా ఉన్న ముహమ్మద్ పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఆయన మంత్రి కూడా అయ్యారు. అయితే ఎం అండ్ ఎం గ్రూపులో తన తమ్ముళ్లని పార్ట్నర్లుగా జగదీశ్ చంద్ర చేర్చారు. అనంతరం కంపెనీ పేరును మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చారు. - టాటా, మహీంద్రా గ్రూపులు చూపిన బాటలో ఇండియాలో స్టీలు పరిశ్రమ అంచెలంచెలుగా ఎదుగుతూ జపాన్ను వెనక్కి నెట్టింది. చైనా తర్వాత రెండో స్థానంలో నేడు ఇండియా నిలిచింది. I began my career in the 80’s at our alloy steel company. Back then the Japanese dominated the industry like unshakeable Gods. It was unimaginable that we could ever be more than a midget in front of them. I wonder if today’s youth will understand the magnitude of this milestone https://t.co/c0KOhuZEQm — anand mahindra (@anandmahindra) January 6, 2021 - 80,90వ దశకాల్లో రూరల్ ఇండియాలో కనెక్టివిటీకి మరోపేరుగా మహీంద్రా కమాండ్ జీపులు నిలిచాయి. - మహీంద్రా గ్రూపుకి 72 దేశాల్లో కార్యాలయాలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. 100కు పైగా దేశాల్లో మహీంద్రా ఉత్పత్తులకు డిమాండ్ ఉంది. 🙏🏽 for all your congratulations on my Padma Bhushan award. Repeating my tweet from last year: “There’s an old saying: If you see a turtle on top of a fence, you know for sure it didn’t get there on its own! I stand on the shoulders of all Mahindraites.” https://t.co/tdJBbjNNWo — anand mahindra (@anandmahindra) November 9, 2021 వారి వల్లే ఈ ఘనత పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన సందర్భంలో వచ్చిన ప్రశంసలకు ఆయన వినమ్రంగా స్పందించారు.. ఈ ఘనత వెనుక మహీంద్ర సంస్థ ఉద్యోగుల శ్రమ ఉందన్నారు. వారి భుజాలపై తాను నిలబడి ఈ అవార్డు అందుకున్నట్టుగా తెలిపారు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
ఫ్లిప్ కార్ట్ లో పుస్తకం ధర పై మళ్లీ జోకులు!
బిగ్ బిలియన్ డే ఘటనను ఇంకా మరిచిపోకముందే ఫ్లిప్ కార్ట్ మరో తప్పిదం చేసింది. ఆంటానియో సియాన్ రచించిన 'ఫోర్ టోల్డ్' పుస్తకం ధర 33,86,660 రూపాయలు అని.. 5 శాతం డిస్కౌంట్ తర్వాత 32,17,223 అంటూ వెబ్ సైట్ లో పెట్టారు. ఈ పుస్తకం ధరపై జోకులు పేలడంతో చేసిన తప్పును వెంటనే గుర్తించి ఫ్లిప్ కార్ట్ తన తప్పును సరిద్దిదుకుంది. ఈ పుస్తకం ధరపై ఇంటర్నెట్ లో లెక్కలేనని జోకులు పేలాయి. 'ఈ పుస్తకం కొనడానికి ప్రపంచ బ్యాంక్ తోపాటు అన్ని బ్యాంకులను సంప్రదించాం. కాని ఎలాంటి ఫలితం కనిపించలేదు. స్విస్ బ్యాంక్ లో భారతీయ రాజకీయ వేత్తలు దాచుకున్న నల్లధనంతో ఈ పుస్తకం కొనవచ్చేమో' అంటూ వ్యాఖ్యలు చేశారు. 'ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే.. కనీసం 155,993 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది' ఓ నెటిజన్ ట్విటర్ లో ఓసందేశాన్ని పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు లియోనార్డ్ డా విన్సీ రచించిన పుస్తకం అత్యంత ఖరీదైనదిగా రికార్డుకెక్కింది. 1994 నవంబర్ లో క్రిస్టీ హౌజ్ నిర్వహించిన వేలంలో 30.8 మిలియన్ డాలర్ల చెల్లించి మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సొంతం చేసుకున్నారు. Follow @sakshinews