Bill Gates meets RBI Governor Shaktikanta Das in Mumbai - Sakshi
Sakshi News home page

ఆర్‌బిఐ గవర్నర్‌తో బిల్ గేట్స్ చర్చలు - ఫోటోలు వైరల్

Feb 28 2023 3:42 PM | Updated on Feb 28 2023 4:26 PM

Bill gates meets rbi governor shaktikanta das  - Sakshi

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' ఈ రోజు (ఫిబ్రవరి 28) ముంబైలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గవర్నర్ 'శక్తికాంత దాస్‌'ని కలిసి విస్తృత చర్చలు జరిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆర్‌బిఐ ఒక ట్వీట్‌ ద్వారా తెలిపింది. ఇందులో బిల్ గేట్స్, శక్తికాంత దాస్‌ కలసి ఉన్న ఫోటోలు ఉండటం కూడా చూడవచ్చు.

మోస్ట్ పాపులర్ బిజినెస్ మ్యాన్ అయిన బిల్ గేట్స్ ఆరోగ్యం,విద్య, ఇతర రంగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి భారతదేశంలో ప్రత్యేక పర్యటనలో ఉన్నారు. ప్రపంచములోని ఇతర దేశాల మాదిరిగానే భారతదేశంలో వనరులు పుష్కలంగా యి, ప్రతి రంగంలోనూ భారతదేశంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.

ఎంతటి పెద్ద సమస్యలనైనా ఒకేసారి ఎదుర్కొనే సత్తా భారతదేశానికి ఉందని, అనే విషయాల్లో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించగలదని కూడా బిల్ గేట్స్ ఇండియాను కొనియాడారు. భారత్‌ను చూస్తే భవిష్యత్తుపై ఆశ కలుగుతోందని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమయినప్పటికీ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే పనులెన్నో చేయగలుగుతోందని ఇటీవల గొప్పగా ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement