Pawar
-
బ్లాక్ బాక్స్ దొరికింది.. అడ్డంగా బుక్కైన రామ్మోహన్ నాయుడు
-
అజిత్ కేసును నీరుగార్చేందుకే.. సీబీఐ దర్యాప్తు!
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి దారితీసిన విమాన ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) తీవ్రంగా తప్పు బట్టింది. దర్యాప్తును ఆలస్యం చేసి నీరుగార్చేందుకే ఫడ్నవీస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందంటూ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సోమవారం దుయ్యబ ట్టారు. సీబీఐ వద్ద ఇప్పటికే ఏకంగా 7 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు. వాటిలో 2,500 కేసులకైతే ఏకంగా దశాబ్దానికి అతీగతీ లేదంటూ ఆక్షేపించారు. దర్యాప్తు పేరుతో కాలహరణం చేసే ఈ యత్నాలను తాము అంగీకరించే ప్రసక్తే లేదని రోహిత్ కుండబద్దలు కొట్టారు. విమాన ప్రమాదంపై సీఐడీతోనే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన వివరాల్లో 30 శాతాన్ని మాత్రమే బయటపెట్టారని కూడా ఆయన ఆరోపించారు. ప్రమాదంలో బ్లాక్‌బాక్స్ కాలిపోయిందని చెప్పడంపై పలు అనుమానాలు వెలిబుచ్చారు. ‘‘బ్లాక్‌బాక్స్‌ను సురక్షితంగా వెలికితీశారు. దాన్ని అందరూ చూశారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నా దగ్గరున్నాయి. ఇప్పుడు అది కాలిపోయిందని చెప్పడం వెనక మతలబు ఏమిటి?’’ అని ప్రశ్నించారు. దర్యాప్తులో ఏవైనా లోపాలు జరిగినట్టు తేలితే ఫడ్నవీస్ సర్కారు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అంతకుముందు అసెంబ్లీలో అజిత్ పవార్‌కు రోహిత్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో తన సాన్నిహిత్యాన్ని తలచుకుంటూ కంటతడి పెట్టారు.అజిత్ విమాన ప్రమాదం దర్యాప్తులో జరుగుతున్న జాప్యం పలు ప్రశ్నలకు తావిస్తోందని ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన మరో ఎమ్మెల్యే జితేంద్ర అవద్ కూడా పేర్కొన్నారు. ‘‘బ్లాక్‌బాక్స్ కాలిపోవడం ఏమిటి? ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కడా అలా జరగలేదు. ప్రమాద కారణాలను తేల్చేందుకు జరుగుతున్న దర్యాప్తే మరిన్ని అనుమానాలకు దారితీస్తే ప్రజలిక దేన్ని నమ్మాలి?’’ అని ప్రశ్నించారు. ప్రమాదానికి గురైన విమానానికి భారత్‌లో నడిచేందుకు అనుమతే లేదని అవద్ ఆక్షేపించారు. ‘‘ఆ విమానాన్ని మొత్తం జీవితకాలంలో గరిష్టంగా 5,000 గంటలకు మించి నడపరాదు. కానీ అప్పటికే అది 8,000 గంటల పాటు నడిచింది. ఇవన్నీ మొత్తం ఉదంతంపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి’’ అన్నారు. -
ప్లేన్ క్రాష్‌పై దర్యాప్తుకు టీడీపీ బ్రేకులు
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రమాదంలో మృతి పట్ల తమకు అనేక అనుమానాలున్నాయని, ఆయన ప్రయాణించిన విమానం వీఎస్ఆర్ కంపెనీతో టీడీపీ ముఖ్యులకు లోపాయికారీ ఒప్పందాలు, సంబంధాలు ఉన్నందునే దర్యాప్తు సవ్యంగా సాగడం లేదని ఎన్సీపీ (శరద్ పవార్) నేత, అజిత్ పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ రాజేంద్ర పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్, వీఎస్ఆర్ కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ రెండు కంపెనీల మధ్య వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరగబట్టే.. ప్రమాద ఘటన వ్యవహారంలో విచారణ పారదర్శకంగా సాగకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు. అందుకే విచారణ పూర్తి కాకుండానే వీఎస్ఆర్ కంపెనీ తప్పేమీ లేదని రామ్మోహన్ నాయుడు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఎస్ఆర్ కంపెనీతో టీడీపీ పెద్దలకున్న ఆర్థిక లావాదేవీల కారణంగా విచారణ ప్రక్రియను రామ్మోహన్ నాయుడు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని, లేదా రామ్మోహన్ స్వయంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరును, వీఎస్ఆర్ కంపెనీతో టీడీపీ ముఖ్యులకు ఉన్న బంధాన్ని వివరిస్తూ, రామ్మోహన్ నాయుడు వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. హెరిటేజ్‌తో ఆర్థిక లావాదేవీలుచంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్, వీఎస్ఆర్ కంపెనీల మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయని రోహిత్ చెబుతూ.. ఈ రెండు కంపెనీల మధ్య 2023 మార్చి 30న జరిగిన ‘హైపోథిటికేషన్’ ఒప్పంద పత్రాన్ని చూపించారు. పక్కనే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, డాక్టర్ ఎం.సాంబశివరావుల ఫొటోలను చూపిస్తూ మీడియాకు వివరించారు. వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం.. ముఖ్యంగా విమానాల కొనుగోలు అవసరాల కోసం అంటూ హెరిటేజ్ ఫిన్‌లీజ్ సంస్థ నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుందని చెప్పారు. వీఎస్ఆర్ కంపెనీ వెనుక రాజకీయ, వ్యాపార వేత్తలు ఉన్నారని.. ఆ కంపెనీతో టీడీపీ అధినేతలకు, రామ్మోహన్నాయుడికి కూడా సంబంధాలు ఉన్నాయన్నారు. ‘ఓ పక్క ప్రమాదం జరిగి అందరూ శోక సంద్రంలో ఉంటే.. మరో పక్క వీఎస్ఆర్ కంపెనీ తప్పేమీ లేదని కేంద్ర మంత్రి పదవిలో ఉన్న రామ్మోహన్ ప్రకటించడం ఏమిటి? అంత త్వరగా ఆ కంపెనీకి వకాలత్ పుచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి? అసలు ప్రాథమిక రిపోర్టు రాకుండానే బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వొచ్చా? ఏడాది క్రితం రాజస్తాన్‌లో జరిగిన కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ ఫంక్షన్‌కు టీడీపీలోని ప్రముఖ నేతలు హాజరు కావడంతో మాకు అనుమానాలొచ్చాయి. టీడీపీకి చెందిన ప్రముఖ నేతలు, రామ్మోహన్ వీఎస్ఆర్ కంపెనీతో సన్నిహితంగా ఉండబట్టే.. అజిత్ పవార్ ప్రమాద ఘటనకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కావడం లేదు. ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ ఆ పదవిలో ఉంటే విచారణను పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నాయి. తక్షణం కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్‌ను ఆ పదవి నుంచి తప్పించాలి. అజిత్ పవార్ మృతిపై మోదీ, అమిత్‌షాలు న్యాయం చేయాలి’ అని కోరారు. హెరిటేజ్ నుంచి రూ.వందల కోట్లు‘హెరిటేజ్ నుంచి వీఎస్ఆర్ కంపెనీకి రూ.200–300 కోట్ల ఫండింగ్ వచ్చింది. అందుకే వీఎస్ఆర్ కంపెనీని టీడీపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ కాపాడుతున్నారు. విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని లోతుగా పరిశీలిస్తే పలు విషయాలు తెలిశాయి. ఈ క్రమంలో హెరిటేజ్‌కు, వీఎస్ఆర్కు మధ్య ఉన్న ఒప్పందం వెలుగులోకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్)లో ఉన్నారు. మెజార్టీ షేర్ హోల్డర్లు వీళ్లవే ఉన్నాయి. వీళ్ల నుంచే వీఎస్ఆర్కు ఫండ్స్ వెళ్లాయి. వీళ్ల మధ్య ఇంతగా ఆర్థిక లావాదేవీలు ఉండబట్టే అజిత్ పవార్ ప్రమాద ఘటనపై విచారణ పారదర్శకంగా జరగట్లేదు. అందుకే రామ్మోహన్నాయుడిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 1,100 డిగ్రీల వేడిలో ఉన్నా బ్లాక్ బాక్స్ కాలిపోవడం జరగదు. కానీ ఈ ఘటనలో బ్లాక్ బాక్స్ కాలిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. టీడీపీకి చెందిన కీలక వ్యక్తి రూ.650 కోట్లతో దుబాయిలో వీఎస్ఆర్ కంపెనీ ద్వారా విమానం కొనుగోలు చేశాడు. ఇలా ఒకటి, రెండు విషయాలు కాదు.. చాలా ఆర్థికపరమైన వ్యవహారాలు టీడీపీ నేతలు, వీఎస్ఆర్ కంపెనీకి మధ్య ఉన్నాయి’ అని రోహిత్ పవార్ చెప్పారు.కుట్ర కోణంలో దర్యాప్తు జరగాలిప్రమాదం జరిగిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ పేలుళ్లు జరిగాయని రోహిత్ పవార్ తెలిపారు. వీఎస్ఆర్ కంపెనీ వెనుక రాజకీయ పార్టీల నేతలు, వ్యాపార వేత్తలు ఉండటం వల్లే ఆ కంపెనీకి కొమ్ముకాస్తున్నట్లు చెప్పారు. ‘డీజీసీఏలో కొంత మంది అధికారులు వీఎస్ఆర్ కంపెనీతో కుమ్మక్కయ్యారు. అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగి, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం దుర్మరణం చెందినా.. కంపెనీ యజమాని వీకే సింగ్‌ను అరెస్టు చేయలేదు. దీని వెనుక కేంద్ర మంత్రి రామ్మోహన్ హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. వీఎస్ఆర్ పైలెట్ కపూర్ లైసెన్స్‌పై కూడా అనుమానాలు ఉన్నాయి. పైలెట్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసింది. పైలెట్లకు 12 గంటల విశ్రాంతి ఇవ్వాలన్న నిబంధనలకు వీఎస్ఆర్ తూట్లు పొడిచింది. రూ.35 కోట్లు విలువ గల విమానానికి రూ.265 కోట్లు (ఈ విమానం ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10–15 కోట్లే. అయితే ఏకంగా రూ.55 కోట్ల ఇన్సూ్యరెన్స్, రూ.210 కోట్ల లయబిలిటీ ఇన్సూ్యరెన్స్) ఇన్సూ్యరెన్స్ చేశారు. దీనిపై అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి. అనుమతి లేని కంపెనీకి చెందిన బ్లాక్ బాక్స్‌ను ఈ విమానంలో వినియోగించారు. బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పడం చూస్తుంటే మరిన్ని అనుమానాలకు ఆజ్యం పోసినట్లు అవుతోంది. టాయిలెట్ వెనుక లగేజ్ పెట్టే ప్రాంతంలో కొన్ని పెట్రోల్ క్యాన్లను ఉంచారు. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యూయల్ నింపారు. అందుకే ఎక్కువ పేలుళ్లు జరిగాయి. ఒక క్రికెటర్ వీఎస్ఆర్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్‌లో తీవ్రమైన సమస్య వచ్చింది. ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. వీఎస్ఆర్ విమాన జీవిత కాలం 5 వేల గంటలు మాత్రమే. ప్రమాదం జరిగిన సమయానికి 85 గంటలు మాత్రమే మిగిలి ఉంది. డీజీసీఏ అధికారులను ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యాలు వీఎస్ఆర్ కంపెనీకి ఉన్నాయి. అందుకే క్యాబిన్ క్రూ సిబ్బందిని ప్యాసింజర్లా చూపించారు. ఈ ప్రమాదంపై కుట్ర కోణంలోనూ విచారణ జరగాలి’ అని అన్నారు. తక్షణం రామ్మోహన్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. రూ.10 కోట్ల నుంచి రూ.500 కోట్లకు.. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక రాజకీయ, కమర్షియల్ కుట్ర ఉంది. వీఎస్ఆర్ కంపెనీతో డీజీసీఏ అధికారి, కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు మంచి సంబంధాలున్నాయి. అందుకే ఆ కంపెనీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కంపెనీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ప్రమాదాలు, అవకతవకలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. ప్లేన్ క్రాష్ ఘటన కేసులో దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజాలను సమాధి చేస్తున్నారు. కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్‌ను పట్టుకోకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అసలు రోహిత్ సింగ్‌కు డీజీసీఏ ఎందుకు మద్దతిస్తోంది? రామ్మోహన్ నాయుడు మంత్రి పదవిలో ఉంటే దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదు. 2016లో రూ.10 కోట్ల కంపెనీ 2025లో రూ.500 కోట్లకు చేరింది. రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తప్పించండి బారామతి విమాన ప్రమాదంపై ప్రధానికి రోహిత్ పవార్ లేఖ ముంబై: బారామతి విమాన ప్రమాదంపై విచారణ పూర్తయ్యే వరకు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడును పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ రోహిత్ పవార్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.విమాన ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని, వీటిని స్వతంత్ర సంస్థతో దర్యాప్లు జరిపించి నివృత్తి చేయాలని కోరారు. -
అజిత్ విమాన ప్రమాదం: ‘వారంతా కుమ్మక్కయ్యారు’
ఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వెంటనే రాజీనామా చేయాలని ఎన్సీపీ (శరద్‌పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అజిత్ పవార్‌కు మోదీ, అమిత్ షా న్యాయం చేయాలన్నారు. విమానంలో పెట్రోల్ క్యాన్లు ఉన్నట్లు మాకు తెలుస్తుంది. దీని వల్లే విమానం మంటల్లో చిక్కుకుందన్నారు.‘‘విమానంలో కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యూయల్ నింపారు. కుట్రపూరితంగానే ఎక్కువ ఫ్యూయల్ నింపినట్లు మాకు అనుమానం. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ పేలుళ్లు జరిగాయి. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి’’ అని రోహిత్ పవార్ పేర్కొన్నారు.వీఎస్ఆర్ ట్రావెల్స్ వెనుక ఎవరున్నారో బయటకురావాలి. వీఎస్ఆర్ కంపెనీ మేనేజర్ వీకే సింగ్‌ను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు?. పైలెట్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు మాకు తెలుస్తోంది. డీజీసీఏలోని కొంతమంది ఉన్నతాధికారులు వీఎస్ఆర్ ట్రావెల్స్తో కుమ్మక్కయ్యారు. బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పడం కూడా పూర్తి అబద్ధం. రామ్మోహన్నాయుడు పదవిలో ఉంటే విచారణను ప్రభావితం చేస్తారు’’ అంటూ రోహిత్ పవార్ వ్యాఖ్యానించారు.‘‘అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక రాజకీయ, కమర్షియల్ కుట్ర ఉంది. వీఎస్ఆర్ కంపెనీ వెనుక డీజీ సీఏ పెద్ద అధికారి హస్తం ఉంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు వీఎస్ఆర్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. వీఎస్ఆర్ కంపెనీను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తొలగించాలి. టీడీపీ మంత్రి నుంచి రాజీనామా తీసుకోవాలి. ఈ కేసులో నిజం బయట పెట్టేందుకు మోదీ, అమిత్ షా జోక్యం చేసుకోవాలి...అవసరానికి మించి ఇంధనం ఇందులో నింపారు. విమానంలో పెట్రోల్ క్యాన్స్ పెట్టారు. వీఎస్ఆర్ కంపెనీకి రామ్మోహన్నాయుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కేసులో శ్వేత సింగ్ దర్యాప్తును తప్పు దోవ పట్టిస్తున్నారు. బ్లాక్ బాక్స్ సీవీఆర్ పూర్తిగా తగలబడిందని చెప్పడం అబద్ధం. రామ్మోహన్నాయుడు ఈ పదవిలో ఉంటే దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదు. వీఎస్ఆర్ ఓనర్ వీకే సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?వీఎస్ఆర్ కంపెనీ నిర్వహణలో అనేక అవకతవకలు ఉన్నాయి. వీఎస్ఆర్ కంపెనీలో మహిళా పైలెట్లపై వేధింపులు జరిగాయి. అనేక అవకతవకలు జరుగుతున్నా డీజీసీఏ పట్టించుకోలేదు. ప్రమాదాలు, అవకతవకలు జరుగుతున్నా వీఎస్ఆర్ ఆపరేషన్స్ మాత్రం యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిజాలను సమాధి చేసేందుకు బ్లాక్ బాక్స్ తగలబడిందని చెపుతున్నారు. 2016లో రూ.10 కోట్ల కంపెనీ.. 2025కు 500 కోట్లకు చేరింది. కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్‌ను పట్టుకోకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. రోహిత్ సింగ్‌కు డీజీసీఏ ఎందుకు మద్దతు ఇస్తుంది’’ అంటూ రోహిత్ పవార్ నిలదీశారు. -
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు రాజీనామా చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురి ప్రాణాలను బలిగొన్న ఘోర విమాన ప్రమాద ఘటనకు కారణమైన చార్టర్డ్ విమానయాన సంస్థ వీఎస్ఆర్ వెంచర్స్‌ను కాపాడేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, తెలుగుదేశం పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నందున సదరు మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ (శరద్‌పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ గురువారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రమాదం వెనుక ‘ఇన్సూరెన్స్’ కోణం కూడా ఉన్నట్లు రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణ చేశారు. విమానం కొనుగోలు ధర రూ.35 కోట్లు అయితే.. దాని ప్రస్తుత మార్కెట్ విలువ కేవలం రూ.10 నుంచి రూ.15 కోట్లు మాత్రమేనని.. అయితే, ఆశ్చర్యకరంగా ఆ విమానానికి ఏకంగా రూ.55 కోట్ల ఇన్సూరెన్స్, అలాగే రూ.210 కోట్ల మేర లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. లియర్ జెట్ విమాన ప్రమాదంలో ఆ చార్టర్డ్ విమానాన్ని నిర్వహించిన వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థను తెలుగుదేశం పార్టీ పెద్దలు వెనకేసుకొస్తున్నారని రోహిత్ పవార్ ఆరోపించారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి, తెలుగుదేశం పార్టీ పెద్దలకు వీఎస్ఆర్ కంపెనీ యజమానులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. వీఎస్ఆర్ సంస్థ యజమాని వీకే సింగ్ కుమారుడు రోహిత్ సింగ్ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు, మంత్రులు, మహారాష్ట్ర మాజీమంత్రులు కూడా హాజరయ్యారని రోహిత్ పవార్ ఆధారాలతో సహా బయటపెట్టారు.వీరి మధ్య ఇంతటి సాన్నిహిత్యం ఉండడంవల్లే విమానయాన సంస్థను వారు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. రామ్మోహన్ నాయుడు మంత్రిగా కొనసాగితే విచారణ పక్కదోవ పట్టే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. ప్రయాణికుల ప్రాణాలతో వీఎస్ఆర్ చెలగాటంప్రమాదానికి గురైన విమానంలో పరిమితికి మించి అదనపు ఇంధన ట్యాంకులను నింపారని, అవే విమానంలో బాంబుల్లా పేలాయని రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేవలం బారామతి వరకు వెళ్లే విమానానికి అంత ఇంధనం ఎందుకు? అవసరమైతే హైదరాబాద్‌లో ఇంధనం నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా ఎందుకు చేయలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ దుర్ఘటన కేవలం ప్రమాదం కాదని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న అనుమానాలకు ఈ చిన్నచిన్న పరిణామాలే బలాన్పిస్తున్నాయని తేల్చిచెప్పారు. వీఎస్ఆర్ సంస్థ తమ విమానాలను కనీస స్థాయిలో కూడా మెయింటెనెన్స్ చేయకుండా వీవీఐపీలు, ఇతర ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతోందని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు, ఎక్కడా ఎలాంటి లోపాలు లేనట్లుగా ఆ సంస్థ యజమాన్యం డాక్యుమెంట్లను తారుమారు చేస్తోందని ఆరోపించారు. మియామికి పారిపోయిన యజమానులుఈ మొత్తం వ్యవహారంలో వీఎస్ఆర్ వెంచర్ యజమాని వీకే సింగ్, ఆయన కుమారుడు రోహిత్ సింగ్ ఆచూకీపై రోహిత్ పవార్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన వెంటనే రోహిత్ సింగ్ దేశం విడిచి పరారయ్యాడని, ప్రస్తుతం అతను మియామిలో ఉన్నాడని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉన్నప్పటికీ, అధికారులు అలా చేయకపోవడం దారుణమన్నారు.రాజకీయ కుట్ర ఉందా?ఇదిలా ఉంటే.. బలమైన నాయకులను అజిత్ పవార్ ఎదిరించినందున, ఆయన భద్రతపై గతంలోనే ఆందోళనలు వ్యక్తమయ్యాయని రోహిత్ పవార్ తెలిపారు. ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం ఎన్డీయేలో చేరడం.. లేదా అజిత్ పవార్ ఎన్డీయే నుంచి తప్పుకోవడం వంటి ఊహాగానాల నేపథ్యంలో కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర కోణం ఉందా అనేది తేలాల్సి ఉందన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ సహా పలువురు ఎన్సీపీ నేతలు ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరడాన్ని రోహిత్ పవార్‌స్వాగతించారు. మరోవైపు, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ప్రమాదంపై ఫిబ్రవరి 27 నాటికి ప్రాథమిక నివేదికను విడుదలచేసే అవకాశముంది. ఈ తరుణంలో విమానయాన సంస్థకు, టీడీపీ నేతలకు మధ్య ఉన్న బంధంపై వస్తున్న తీవ్ర ఆరోపణలు జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్నాయి. సమగ్ర విచారణ జరపాల్సిందే: సుప్రియా సూలే ఇక ఈ వ్యవహారంపై బారామతి ఎంపీ, అజిత్ పవార్ సోదరి సుప్రియా సూలే సైతం స్పందించారు. ప్రమాదానికి సంబంధించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, ఈ ఘటనపై పారదర్శకమైన, సమగ్ర విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. రోహిత్ పవార్ చేస్తున్న పోరాటం శాస్త్రీయమైనదంటూ మద్దతు పలికారు. విమాన ప్రమాదం వెనుక అసలు నిజాలు బయటికి రావాలని రోహిత్ పవార్ కోరుకుంటున్నాడని చెప్పారు. అందుకే సమగ్ర విచారణను కోరుతున్నామని సుప్రియా స్పష్టంచేశారు. -
‘అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక టీడీపీ నేతల హస్తం’
ముంబై: అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందంటూ ఎన్సీపీ నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. విమానయాన సంస్థ వీఎస్ఆర్ యజమాని రోహిత్ సింగ్‌కు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని.. విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. రామ్మోహన్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.అజిత్ పవార్‌ది ప్రమాదం కాదు.. ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య. రోహిత్‌సింగ్‌ను కాపాడే ప్రకటనలు చేస్తున్నారు. దర్యాప్తు నిష్ప్రక్షపాతంగా జరగాలంటే రామ్మోహన్నాయుడిని తప్పించాల్సిందేనని రోహిత్ పవార్ అన్నారు. ఈ కుట్రలో భారీ ఆర్థిక లావాదేవీల కోణం కూడా దాగి ఉందన్న రోహిత్.. రూ. 35 కోట్ల విలువచేసే విమానానికి రూ.210 కోట్లతో బీమా వెనుక మర్మమేంటి? అంటూ ప్రశ్నించారు.ప్రమాద సమయంలో ఫ్లైట్‌లోని ఇంధనాన్ని అక్రమంగా తరలించారని.. పైలట్‌ను బ్లాక్మెయిల్ చేసి ప్రమాదం చేయించి ఉండొచ్చు అంటూ రోహిత్ పవార్ ఆరోపించారు. విచారణ పూర్తికాకముందే రోహిత్ సింగ్‌ను దేశం విడిచి అమెరికా వెళ్లేందుకు ఎలా అనుమతిచ్చారు?. బ్లాక్ బాక్స్ సేఫ్‌గా ఉన్నా పాడైపోయిందని తప్పుడు ప్రచారం చేశారంటూ రోహిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ పవార్‌కు రోహిత్ పవార్ మేనల్లుగు. గతంలో అజిత్ పవార్‌తో కలిసి పని చేశారు. -
‘అమ్మాయిపై చెయ్యేస్తే నపుంసకుడిని చెయ్యాలి’
దేశంలో అత్యాచార ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటూ పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని బద్లాపూర్ మరో అత్యాచారం ఉదంతం వెలుగు చూసింది.ఈ ఘటనకు కారకులైన వారిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై చేయివేసే వారిని నపుంసకులుగా మార్చాలని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేసేవారికి చట్టం ఉన్నదనే భయాన్ని కల్పించాలని, అప్పుడు ఎవరూ తప్పుడు పనులకు పాల్పడరని అజిత్ పవార్ అన్నారు.యావత్మాల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బద్లాపూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు విధించాలని కోరుతూ రూపొందించిన బిల్లును మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్ముకు పంపిందన్నారు. ఇది చట్టరూపం దాల్చి, అమలులోకి వస్తే మహిళలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. -
‘శరద్ పవార్‌కు టచ్‌లో 19 మంది అజిత్ వర్గం ఎమ్యెల్యేలు’
ముంబై: లోక్‌సభ ఎన్నికల ముగిసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) నేత రోహిత్ పవార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని అధికార ఎన్సీపీ నుంచి 18-19 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారని తెలిపారు. వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారన్నారు. 2023 జూలైలో ఎన్సీపీలో చీలికలు జరిగినప్పటి నుంచి అజిత్ వర్గంవైపు ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒక్కమాట కూడా ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, ఇతర సీనియర్ నేతలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు.‘అజిత్ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల నిధుల కోసం సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత వారంతా అజిత్ వర్గం నుంచి బయటకు వచ్చేస్తారు. 18 నుంచి 19 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్‌తో టచ్‌లో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత శరద్ పవార్ వర్గంలో వారంతా చేరనున్నారు’అని రోహిత్ పవార్ అన్నారు. అజిత్ పవార్ వర్గం రాజ్యసభ ఎంపీప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. తనకు కేబినెట్ విస్తరణలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెతున్నారు. అంటే అజిత్ పవార్ వర్గంపై ప్రఫుల్‌కు మంచిపట్టు ఉందని తెలుస్తోంది. కానీ, అజిత్ పవార్ అనుకుంటున్న రాష్ట్ర అభివృద్ధి కోసమా? లేదా తనను ఈడీ నుంచి రక్షించుకోవడానికా? అని రోహిత్ పవార్ నిలదీశారు.ఇటీవల ఎంపీ ప్రఫుల్ పటేల్‌కు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రమంత్రి( సంతంత్ర హోదా) పదవి ఆఫర్ ఇస్తే.. దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపి( ఎస్పీ) 8, అజిత్ వర్గం ఎన్సీపీ 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జూన్ జూన్ 27 నుంచి జూలై 12 వరకు జరగనున్నాయి. అక్టోబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. -
మన్మోహన్ సింగ్‌పై పవార్ కీలక వ్యాఖ్యలు
పుణె: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ రైతుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉండేవారని ప్రస్తుతం రైతుల సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకుని ప్రధానిగా ఉన్నపుడు మహారాష్ట్ర అమరావతి ప్రాంతంలో మన్మోహన్ పర్యటించారని పవార్ తెలిపారు. ‘మన్మోహన్ సింగ్ సామాన్య ప్రజలు, రైతుల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించేవారు. అందుకే ఆయన రూ.72 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారు. ప్రస్తుతం దేశంలో రైతుల సమస్యల వైపు కన్నెత్తి చూశే వారు లేరు’ అని పవార్ అన్నారు. పుణెలోని శేట్కారి ఆక్రోశ్ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుండా బీజేపీ కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పొత్తు ఈవీఎంలతోనేనన్నారు. ఈ కార్యక్రమానికి శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ థాక్రేతో పాటు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు హాజరయ్యారు. ఇదీచదవండి..సన్‌బర్న్ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు -
అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం
సాక్షి, మహబూబాబాద్: జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్‌ను బదిలీపై జిల్లాకు పంపారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మిక బదిలీపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. 2021 డిసెంబర్ 26న జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ.. ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా 20 నెలల్లో బదిలీ కావడం.. దీని వెనుక ఏం జరిగింది అనేది అటు అధికారులు.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఆకస్మిక బదిలీతో షాక్.. జిల్లా పోలీస్‌బాస్ ఆకస్మిక బదిలీతో ఆశాఖ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేయలేదు. దీంతో ఆయన ఎన్నికల వరకు ఉంటారని అందరు భావించారు. అయితే కుటుంబ సభ్యుల్లో జరిగిన రాజకీయ పరిణామాలే ఆయన బదిలీకి కారణం అని కొందరు చెబుతుండగా.. ఎస్పీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖ తీసుకున్న నిర్ణయం అని మరికొందరు చెబుతున్నారు. కుటుంబ రాజకీయ పరిణామాలే కారణమైతే ఎస్పీ బదిలీతోనే ఆగిపోతుంది. అలా కాకుంటే ఎస్పీతో పాటు మరికొందరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని పలువురు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎస్పీ బదిలీ వార్తతో ఆయనకు అనుకూలంగా ఉండే అధికారులు మాత్రం ఆందోళనగానే ఉన్నట్లు సమాచారం. ఆ కోపమేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తన బిడ్డను ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడం లేదు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దీంతో ఆమె మనస్తాపం చెందిగా.. భర్త శ్యాం నాయక్ ఉద్యోగం వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమేరకు నేడో రేపో రేఖానాయక్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమె పార్టీ మారకుండా ఉండేందుకు పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. దీంతో రేఖానాయక్‌పై కోపంతో ఆమె అల్లుడు ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు మానుకోటలో ప్రచారం జరుగుతోంది. -
‘మహా’ ప్రభుత్వం ఇప్పట్లో లేనట్లేనా?
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ, గందరగోళం మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ప్రభుత్వం ఏర్పడటంపై అనుమానాలు బలపడుతున్నాయి. తదుపరి ప్రభుత్వం తమదేనన్న శివసేన నమ్మకంగా చెబుతున్నా.. ఆ పార్టీకి ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మద్దతివ్వడంపై విభిన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగేందుకు కారణమయ్యాయి. ‘సోనియాతో మహారాష్ట్ర రాజకీయాలపై మాట్లాడాను కానీ ప్రభుత్వ ఏర్పాటుపై మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’ అని పవార్ మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు, మహారాష్ట్రలో శివసేనను దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్సీపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోందని శివసేన వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తే.. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశంతో పాటు, పవార్‌కు రాష్ట్రపతి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు తమకు తెలిసిందని శివసేన వర్గాలు వెల్లడించాయి. అయితే, బీజేపీకి మద్దతిచ్చే విషయాన్ని సోమవారం శరదపవార్ నిర్ద్వంద్వంగా ఖండించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మంగళవారం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య ఢిల్లీలో మంగళవారం జరగాల్సిన చర్చలు నేటి(బుధవారం)కి వాయిదా పడ్డాయి. ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున చర్చలను వాయిదా వేద్దామని కాంగ్రెస్ కోరిందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. నవంబర్ 22న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సమావేశమవనున్నారు. భవిష్యత్ కార్యాచరణను వారికి వివరించనున్నారు. మరోవైపు, శివసేన నేత సంజయ్‌రౌత్ మంగళవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో మీడియానే గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. పవార్ మీడియాతో సోమవారం చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘పవార్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవడానికి 100 జన్మలు ఎత్తాలి’ అని రౌత్ వ్యాఖ్యానించారు. మహమ్మద్ ఘోరిలాంటి వారే.. తాజాగా మరోసారి బీజేపీపై శివసేన విరుచుకుపడింది. పార్టీ పత్రిక సామ్నాలో బీజేపీని భారత్‌పై 17 సార్లు దండెత్తిన మహమ్మద్ ఘోరితో పోలుస్తూ సంపాదకీయం రాసింది. యుద్ధంలో ఓడిపోయిన ఘోరికి హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ ఎన్నోసార్లు ప్రాణబిక్ష పెట్టాడని, కానీ ఒక్కసారి గెలవగానే ఘోరి పృథ్వీరాజ్ చౌహాన్‌ను చంపేశాడని గుర్తు చేస్తూ.. మహారాష్ట్రలో కొందరి తీరు అలాగే ఉందని, నేరుగా బీజేపీ పేరు ఎత్తకుండా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమను సవాలు చేసిన బీజేపీని మహారాష్ట్రలో నామరూపాలు లేకుండా చేస్తామని ఆ సంపాదకీయంలో శివసేన ప్రతిన బూనింది. ఎన్డీయే ఏర్పాటులో శివసేనదే కీలక భూమిక అని, ఆ సమయంలో ఇప్పటి బీజేపీ నాయకులంతా బచ్చాలని మండిపడింది. -
వికసించిన పద్మాలు
-
వికసించిన పద్మాలు
• యేసుదాసు, జోషి, పవార్సహా ఏడుగురికి విభూషణ్ • మరో ఏడుగురికి పద్మభూషణ్ • ఇన్నాళ్లూ వెలుగులోకి రానివారికే ఈసారి పట్టం • జాబితాలో 19 మంది మహిళలు సహా 89 మంది న్యూఢిల్లీ: సామాజిక, రాజకీయ, శాస్త్రసాంకేతిక, వైద్య, సంగీత, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన 89 మంది ప్రముఖులతో 2017 సంవత్సరానికి గానూ కేంద్రం పద్మ అవార్డుల జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురికి రెండో అత్యున్నత భారత పౌరపురస్కారం పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందిని పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేశారు. రాజకీయ కురువృద్ధులు మురళీ మనోహర్ జోషి (బీజేపీ), శరద్ పవార్ (ఎన్సీపీ)కు ఈసారి పద్మ విభూషణ్ అవార్డులివ్వనున్నారు. ఇషా ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది వాలంటీర్లను తయారుచేసిన ఆధ్మాత్మిక సద్గురు జగ్గీ వాసుదేవ్, ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు (ఇస్రో మాజీ చైర్మన్), ప్రముఖ గాయకుడు యేసుదాసు కూడా విభూషణ్ జాబితాలో ఉన్నారు. వివిధ భాషల్లో 50వేలకు పైగా సినిమా పాటలు పాడిన యేసుదాసు 1975లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్ అవార్డులను అందుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వాలకూ మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది పద్మ అవార్డుల ఎంపికలో.. దేశానికి, సమాజానికి విశేష సేవలందిస్తున్నా.. ఇన్నాళ్లుగా గుర్తింపునకు నోచుకోని గొప్పవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే వివిధ రాష్ట్రాల నుంచి జాబితా తెప్పించుకున్నట్లు వెల్లడించింది. మొత్తం 18 వేల నామినేషన్లు (4వేలు ఆన్లైన్లో వచ్చాయి) రాగా అందులోనుంచి 89 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈసారి పద్మ అవార్డుల్లో మహిళలు 19 మంది, విదేశీయులు–ఎన్నారైలు ఐదుగురుండగా.. మరణానంతరం అవార్డులకు ఎంపికైనవారు ఆరుగురున్నారు. వైద్య, సామాజిక రంగంలో కృషిచేసినవారితోపాటు సంగీత దర్శకులు, గాయకులకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గ్రామీ అవార్డు విజేత, మ్యుజీషియన్ విశ్వ మోహన్ భట్ పద్మ భూషణ్‌కు, గాయకులు కైలాశ్ ఖేర్, అనురాధ పౌడ్వాల్లను పద్మశ్రీ అవార్డులు వరించనున్నాయి. భారత శాస్త్రీయ సంగీతంలో భట్‌కు ప్రత్యేక స్థానముంది. పద్మశ్రీకి ఎంపికవటం పట్ల కైలాశ్ ఖేర్, పౌడ్వాల్‌లు హర్షం వ్యక్తం చేశారు. పండిట్ రవిశంకర్ శిష్యుడైన భట్ ‘మోహన వీణ’ అనే కొత్త రాగాన్ని సృష్టించారు. అయితే సినిమా రంగం నుంచి ప్రముఖులెవరికీ ఈసారి జాబితాలో చోటు దక్కలేదు. ప్రముఖ పాకశాస్త్ర ప్రవీణుడు సంజీవ్ కపూర్, కేరళకు చెందిన ప్రఖ్యాత కథాకళి నృత్యకారుడు చెమంచేరి కున్హిరామన్ నాయర్ (100) కూడా పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. క్రీడారంగం నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, రియో ఒలింపిక్స్ తారలు దీపా కర్మాకర్, సాక్షి మాలిక్లూ పద్మశ్రీ అందుకోనున్నారు. పద్మ విభూషణ్ 1. యేసుదాసు. 2. సద్గురు జగ్గీ వాసుదేవ్, 3. శరద్ పవార్, 4. మురళీ మనోహర్ జోషి, 5. ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు, 6. సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం), 7. పీఏ సంగ్మా (మరణానంతరం) పద్మ భూషణ్ 1. విశ్వమోహన్ భట్, 2. ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది, 3. తెహంతోన్ ఉద్వాదియా, 4. రత్న సుందర్ మహారాజ్, 5. స్వామి నిరంజనానంద సరస్వతి, 6. చో రామస్వామి (మరణానంతరం), 7. యువరాణి మహాచక్రి సిరింధోర్న్ (థాయ్‌లాండ్) మట్టిలో మాణిక్యాలు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మశ్రీ పురస్కార విజేతల్లో అనేక మంది ఇప్పటివరకు మనకు పెద్దగా పరిచయం లేని వారే. పేరు, ప్రతిష్టల కోసం కాకుండా కేవలం సేవా దృక్పథంతో, అవసరంలో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తున్న వీరి వివరాలు క్లుప్తంగా... ⇔ కరీముల్ హక్ (52 ఏళ్లు): పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గుడి జిల్లాకు చెందిన ఈయన అంబులెన్స్ దాదాగా గుర్తింపు పొందారు. తేయాకు తోటల్లో పనిచేసే హక్ తన బైక్‌నే అంబులెన్స్‌గా మార్చారు. ఆపదలో ఉన్న వారికి 24 గీ7 సాయం అందిస్తున్నారు. ఆయన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు అంబులెన్సు సౌకర్యం లేక ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని తలచి, అర్థించిన వారికి సాయం చేస్తున్నారు. ⇔ గిరీష్ భరద్వాజ్ (66 ఏళ్లు): కర్ణాటకకు చెందిన ఈయన సామాజిక కార్యకర్త. మారుమూల గ్రామాల్లో నూటికి పైగా చిన్న చిన్న వంతెనలను నిర్మించి పల్లెలను పట్టణాలతో అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించి ‘సేతు బంధు’గా పేరు తెచ్చుకున్నారు. ⇔ అనురాధా కొయిరాలా (67 ఏళ్లు): నేపాల్‌కు చెందిన ఈమె 12 వేల మంది మహిళలను వ్యభిచార ముఠాల చెరల నుంచి విడిపించి, పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. మరో 45 వేల మంది స్త్రీలు అక్రమ రవాణాకు గురి కాకుండా అడ్డుకోగలిగారు. ⇔ డా. సుబ్రతో దాస్ (51 ఏళ్లు): ‘హైవే మీసయ్య’గా పేరొందిన దాస్ గుజరాత్‌కు చెందిన వారు. జాతీయ రహదారులపై ప్రమాదాలకు గురైన వారికి వైద్య సేవలు అందించడానికి బాటలు వేసిన వారిలో ఈయన ఒకరు. లైఫ్‌లైన్ ఫౌండేషన్‌ను స్థాపించి 4 వేల కి.మీ జాతీయ రహదారుల పరిధిలో కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. ⇔ మీనాక్షి అమ్మ (76 ఏళ్లు): కేరళకు చెందిన మీనాక్షి ఏడేళ్ల వయసులోనే యుద్ధ విద్యలు నేర్చుకుని గత 68 ఏళ్లుగా ఇతరులకు నేర్పిస్తున్నారు. ‘కలరిపయట్టు’అనే యుద్ధ విద్యకు ప్రాచుర్యం కల్పించడానికి కృషి చేస్తున్నారు. ⇔ డా. మాపుస్కర్ (88 ఏళ్లు) : మహారాష్ట్రలోని పుణెకు దగ్గర్లోని దెహు గ్రామానికి చెందిన ఈయన 1960ల నుంచే ఆ పల్లెను బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత గ్రామంగా మార్చడానికి కృషి చేశారు. ఈయనకు ‘స్వచ్ఛతా దూత్’అనే పేరుంది. ⇔ గెనాభాయ్ దర్గాభాయ్ పటేల్ (52 ఏళ్లు): గుజరాత్‌కు చెందిన ఈయన దివ్యాంగుడైన రైతు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఆయన గ్రామం నేడు దానిమ్మ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. దీన్ని సాధించడానికి గెనాభాయ్ ఎనలేని కృషి చేశారు. అందుకే ఈయనకు ‘అనార్ దాదా’అనే పేరు కూడా ఉంది. ⇔ బల్వీర్ సింగ్ సీచేవాల్ (51 ఏళ్లు): పంజాబ్‌కు చెందిన బల్వీర్ సామాజిక కార్యకర్త. 160 కి.మీ పొడవైన కాలీ బీన్ అనే నదికి పునరుజ్జీవం తీసుకురావడానికి అక్కడి యువత, స్వచ్ఛంద సేవకులను ఆయన కదిలించారు. ఈయనకు రస్తేవాలే బాబా. సడకన్వాలే బాబా, ఎకో బాబా లాంటి పలు పేర్లున్నాయి. ⇔ బిపిన్ గంటారా (59 ఏళ్లు): ఈయన పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. కోల్‌కతాలో గత 40 ఏళ్లుగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాలకు వెళ్లి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు.బిపిన్ సోదరుడు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి నుంచి ఆయన అగ్ని ప్రమాద బాధితులకు సహాయం చేస్తున్నారు. ⇔ సునితి సాలమన్: చెన్నైకి చెందిన వైద్యురాలైన ఈమె దేశంలో తొలి ఎయిడ్స్ కేసును గుర్తించారు. 2015లో మరణించారు. ఆమె స్మృత్యర్థం కేంద్రం పద్మ పురస్కారాన్ని ప్రకటించింది. ⇔ భక్తి యాదవ్ (91 ఏళ్లు): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎంబీబీఎస్ డిగ్రీ పొందిన తొలి మహిళ ఈమె. గత 68 ఏళ్లుగా ఇండోర్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికి వేల మంది గర్భిణులకు కాన్పులు చేశారు. ⇔ సుక్రీ బొమ్మగౌడ (58 ఏళ్లు): కర్ణాటకకు చెందిన ఈమె జానపద గాయకురాలు. ‘నైటింగేల్ ఆఫ్ హళక్కి’గా గుర్తింపు పొందారు. ⇔ జితేంద్ర హరిపాల్: ఒడిశాకు చెందిన ఈయన ‘రంగబతీ కీ ఆవాజ్’పేరుతో ప్రాచుర్యం పొందారు. ఒడిశాలో బాగా పాపులర్ అయిన రంగబతీ పాట కోసం ఈయన ఎంతో శ్రమించారు. కోస్లి–సంబాల్‌పురి సంగీతానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ⇔ ఎలా అహ్మద్ (81 ఏళ్లు): అస్సాంకు చెందిన వీరు 1970 నుంచి మహిళల కోసం ప్రత్యేక మేగజీన్ నడుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వెలువడుతున్న ఒకే ఒక్క మహిళా మేగజీన్ ఇదే. -
ఆరు నెలల్లో అమలు చేయండి
-
దావూద్ లొంగిపోతానన్నాడు..
కొన్ని షరతులు పెట్టాడు.. పవార్ పట్టించుకోలేదు: జెఠ్మలానీ ముంబై: చీకటి సామ్రాజ్యాధినేత దావూద్ ఇబ్రహీం.. 1990ల్లో భారత అధికారులకు లొంగిపోతానని ముందుకు వచ్చాడని.. కానీ నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్‌పవార్ ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఆరోపించారు. ‘‘దావూద్.. తాను వెనక్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే.. తనపై థర్డ్ డిగ్రీ (హింసాత్మక విచారణ) ప్రయోగించబోమని, తనను గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్)లో ఉంచుతామని ప్రభుత్వం నుంచి హామీ కావాలన్నాడు. తను తప్పు చేసినట్లయితే శిక్ష ఎదుర్కోవటానికి సిద్ధమనీ చెప్పాడు’’ అని జెఠ్మలానీ శనివారం ఏఎన్ఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తాము లండన్‌లో కలిసినపుడు దావూద్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ‘‘అతడు ఈ విషయం చెప్పినపుడు.. నేను దీనిని రాతపూర్వకంగా శరద్‌పవార్‌కు పంపించాను. ఈ ప్రతిపాదన గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా నా కుమారుడికి చెప్పాను’’ అని తెలిపారు. ఈ విషయంలో ముందుకు వెళ్లరాదని నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించి ఉండొచ్చని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ‘‘అది శరద్‌పవారా? లేక కాంగ్రెస్సా? అనేది మాకు తెలీదు. కానీ.. ఈ నిర్ణయాన్ని శరద్‌పవార్ ఒక్కరే తీసుకోగలిగి ఉండకపోవచ్చు. కేంద్రం అభిప్రాయం ఇందులో ఉండి ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. షరతులు ఆమోదనీయం కాదని తిరస్కరించాం: పవార్ రాంజెఠ్మలానీ వెల్లడించిన అంశంపై ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్‌పవార్ స్పందిస్తూ.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని, తనను సంప్రదించటం నిజమేనని.. అయితే అందుకు పెట్టిన షరతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదనీయం కాదని.. దాంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించటం జరిగిందని చెప్పారు. ‘‘దావూద్‌ను జైలులో పెట్టరాదని, అతడిని ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని షరతు పెట్టారు. అది ఆమోదనీయం కాదు. అతడు చట్టం ముందు నిలవాల్సి ఉంటుందని మేం చెప్పాం’’ అని పవార్ శనివారం ముంబైలో విలేకరులకు వివరించారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం కీలక నిందితుడన్న విషయం తెలిసిందే. -
డాలర్స్ కాలనీ న్యూ మూవీ స్టిల్స్
-
వెలుగు పూలు విరిసలా
సంప్రదాయేతర కాంతులు... తెలంగాణలోని 450 వుండలాల్లో వుండలానికి 50 ఎకరాలు సేకరించి 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు పెడితే ఏడాది వ్యవధిలోనే 4,500 మెగావాట్ల ప్రాజెక్టులు ఏర్పడతారుు. అంటే సాగుకు ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలకు రూపారుు కూడా అదనంగా పెట్టే పని లేకుండా రైతుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపవచ్చు. పైగా ఈ ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలో చేపట్టడం ద్వారా ఏడాదిలోనే కనీసం 20 వేల ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. అలాగే తెలంగాణలో 2,000 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికీ అవకాశవుుంది. తెలంగాణ పురోగతి ప్రధానంగా విద్యుత్ రంగంపై ఆధారపడి ఉంది. గృహ రంగం మొదలుకుని పరిశ్రవులు, వ్యవసాయుం దాకా అన్నీ కరెంటుతోనే వుుడిపడి ఉంటారుు. వినియోగదారులకు మెరుగైన సేవలు, సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ సంస్థల పునర్నిర్మాణంజరగడం ఇప్పటి అవసరం. అందుకు నేతల్లో దార్శనికత, ఉద్యోగుల్లో సేవా తత్పరత కావాలని ఆకాంక్షిస్తున్నారు... తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేటర్ కె.రఘు సంక్షోభం ఉండదు విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ సంక్షో భం తలెత్తుతుందని చాలావుంది అభిప్రాయుం. డివూండ్‌తో పోలిస్తే ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల సావుర్థ్యం చాలా తక్కువ కావడం వల్ల అందరి లోనూ అలాంటి ఆందోళన ఉండడం సహజం. కానీ ఈ భయూల్లో వాస్తవం లేదని రాష్ట్ర పునర్వి భజన చట్టంలో పొందుపరిచిన అంశాలను చూస్తే అర్థవువుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను యుథాతథంగా కొనసాగిం చాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. దీనివల్ల తెలంగాణకు కరెంటు లోటు పెరగబోదు. కొత్త గా ఏర్పడే కృష్ణా, గోదావరి నదీ జల నిర్వహణ బోర్డులు ప్రస్తుత ఒప్పందాలకు అను గుణంగా జలవిద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తాయున్నారు సవుస్యలు తప్పవు పునర్విభజన చట్టంలోని పలు అంశాలు రెండు రాష్ట్రాలకూ వుున్ముందు ఇబ్బందికరమే. వాటిని త్వరగా సవరించుకోని పక్షంలో శాశ్వతంగా న్యాయుపరమైన చిక్కులు, ఇతరత్రా సవుస్యలు తలెత్తుతారుు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో వుున్ముం దు కూడా ఉవ్ముడిగానే కొనసాగుతాయున్నారు. అలాగే రెండు రాష్ట్రాలకూ ప్రస్తుత పీపీఏలే కొనసాగనుండడం ఇబ్బందులకు దారి తీస్తుం ది. ఈ పీపీఏల వల్ల అంతర్రాష్ట్ర ట్రాన్స్ మిషన్ చార్జీలుంటారుు. ఇవి వినియోగదారుపై అదనపు భారం మోపుతారుు. ైప్రస్తుతం ప్రైవేట్ ప్లాంట్లన్నీ సీవూంధ్రలోనే ఉన్నారుు. ఉవ్ముడి పీపీఏ విధానం వల్ల వీటి నిర్వహణ, ఒప్పందాల్లో తలెత్తే చిక్కులు దీర్ఘకాలం కొనసాగవచ్చు ఈ సవరణలు చేస్తే మేలు ప్రస్తుత ఏపీ ట్రాన్స్‌కో, జెన్కోలను రద్దు చేసి రెండు రాష్ట్రాలకు విడి విడిగా ఏర్పాటు చేయూలి. ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను ప్రాంతాలవారీగా కేటాయించి, వాటి ఉత్పాదనను ఆయా రాష్ట్రాల కే పరిమితం చేయూలి. ఎవరికీ కేటారుుంచని 20 శాతం ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్‌ను జీవో 53 ఆధారంగా రెండు రాష్ట్రాలకు కేటారుుంచాలి. హైదరాబాద్‌లో ఎస్ఎల్డీసీ ని రెండేళ్ల తర్వాత తెలంగాణ ఎస్ఎల్డీసీగా పేర్కొనాలి. స్వల్ప/ వుధ్యకాలిక ఒప్పందాల ద్వారా వచ్చే విద్యుత్‌ను రెండు రాష్ట్రాల్లో ఏర్పడే లోటు నిష్పత్తిలో పంచా లి. తెలంగాణలో ఎన్టీపీసీ నిర్మించబోయే 4,000 మెగావాట్ల ప్లాంటు తాలూకు మొత్తం విద్యుత్‌నూ తెలంగాణకే కేటారుుంచాలి. -
మూడో కూటమిలో పవార్ చేరరు: ముండే
ముంబై: మూడో కూటమి పేరుతో పలు పార్టీల నేతలు ఒక్కచోట చేరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేంద్రంలో మద్దతునివ్వడమేగాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న రాష్ట్రవాది కాంగ్రెస్(ఎన్సీపీ) మూడో కూటమి నేతలతో సన్నిహితంగా మెలగడం రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. బుధవారం ఢిల్లీలో వామపక్షాలు నిర్వహించిన కార్యక్రమంలో మూడో కూటమిలో చేరే సభ్యులుగా చెప్పుకుంటున్న పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి హాజరు కావడంతో మిత్రపక్షమైన కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే ఈ విషయమై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మూడో కూటమిలో చేరదు. నా అంచనా ప్రకారం పవార్ మూడో కూటమిలో చేరే ఆలోచన చేయకపోవచ్చు. లోక్‌సభ ఎన్నికల కోసం ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు విషయమై ఈ మధ్య కాలంలో కొన్ని విభేదాలు తలెత్తాయి. తాము కోరినన్ని సీట్లను కాంగ్రెస్ ఇచ్చేలా, పాత పొత్తునే కొనసాగించేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఎన్సీపీ మూడో కూటమి సభకు హాజరై ఉండవచ్చు. తమ పంతాన్ని నెగ్గించుకేనుందుకు, కాంగ్రెస్‌ను దారికి తెచ్చుకునేందుకే ఎన్సీపీ అధినేతఈ పాచిక వేశారని నేననుకుంటున్నా. ఇక అత్యాచార నిందితులకు శిక్ష విషయంలో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా అజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ చెప్పే పరిస్థితి కొనితెచ్చుకున్నారు. మీడియా గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిందిగా శరద్‌పవార్ ఆదేశించినా ఆయన చెప్పలేదు. పండగపూట విద్యుత్ కోతలు విధించడాన్ని కూడా అజిత్ పరిహాసం చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడంలే’న్నారు. కాగా పవార్ స్పందిస్తూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏలోనే కొనసాగుతామన్నారు.


