వికసించిన పద్మాలు | Padma Vibhushan for Pawar, M.M. Joshi, Yesudas; Kohli to get Padma Shri | Sakshi
Sakshi News home page

Jan 26 2017 6:28 AM | Updated on Mar 21 2024 8:43 PM

సామాజిక, రాజకీయ, శాస్త్రసాంకేతిక, వైద్య, సంగీత, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన 89 మంది ప్రముఖులతో 2017 సంవత్సరానికి గానూ కేంద్రం పద్మ అవార్డుల జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురికి రెండో అత్యున్నత భారత పౌరపురస్కారం పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందిని పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేశారు. రాజకీయ కురువృద్ధులు మురళీ మనోహర్‌ జోషి (బీజేపీ), శరద్‌ పవార్‌ (ఎన్సీపీ)కు ఈసారి పద్మ విభూషణ్‌ అవార్డులివ్వనున్నారు. ఇషా ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది వాలంటీర్లను తయారుచేసిన ఆధ్మాత్మిక సద్గురు జగ్గీ వాసుదేవ్, ప్రొఫెసర్‌ ఉడిపి రామచంద్రరావు (ఇస్రో మాజీ చైర్మన్‌), ప్రముఖ గాయకుడు యేసుదాసు కూడా విభూషణ్‌ జాబితాలో ఉన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement