ఈసీ కార్యాలయం తగలబడిపోతుంది..! | Danam Nagender Controversial Comments On Bjp | Sakshi
Sakshi News home page

ఈసీ కార్యాలయం తగలబడిపోతుంది..!

Oct 1 2026 2:34 PM | Updated on Oct 1 2026 3:06 PM

Danam Nagender Controversial Comments On Bjp

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తన నియోజకవర్గంలో 20 వేల ఓట్లు తొలగించారని.. ఈసీ అధికారులు బీజేపీతో కుమ్మక్కై వారికి అనుబంధంగా పనిచేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మాత్రం మామూలుగా ఉండదు. ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం తగలబడిపోతుంది’’ ఆయన అంటూ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నేతలు వ్యవస్థీకృతమైన ఓట్‌ చోరీకి పాల్పడుతున్నారని.. ఈసీ తక్షణమే స్పందించి, తొలగించిన ఓట్లను యథావిధిగా పునరుద్ధరించాలని దానం డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకురాలు, పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలంటూ ఆమె దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో, పిటిషన్‌ తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ‘దానం వికెట్‌ పడింది.. రెండో వికెట్‌ ఎవరంటే..?’

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement