స్థానిక ఎన్నికల వ్యూహాలపై వైఎస్‌ జగన్‌ సమీక్ష | YS Jagan Meeting YSRCP Leaders Local Body Poll Strategy | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల వ్యూహాలపై వైఎస్‌ జగన్‌ సమీక్ష

Oct 1 2026 10:48 PM | Updated on Oct 1 2026 10:55 PM

YS Jagan Meeting YSRCP Leaders Local Body Poll Strategy

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశం దాదాపు తొమ్మిది గంటల పాటు కొనసాగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు.

జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై జగన్‌ సమగ్ర సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలను ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేసే అంశాలపై నేతలతో చర్చించారు.

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే వైఎస్సార్‌ సీపీదే విజయమని జగన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement