NTR Hospital
-
గర్భిణి అని కూడా చూడకుండా.. కత్తితో దాడి
విశాఖపట్టణం: గర్భిణి అని చూడకుండా కత్తితో తన భార్యపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన రమేశ్, సంతోషి యశోద భార్యాభర్తలు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో గ్రామ పెద్దల వద్ద పంచాయితీ కూడా నడిచింది. అయితే పెద్దల సమక్షంలో తనతో రానని భార్య తెగేసి చెప్పి కుంచంగిలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. దీంతో రమేశ్ తట్టుకోలేకపోయాడు. కోపంతో కుంచంగిలో ఉన్నఅత్తవారింటికి వెళ్లి సంతోషి యశోదపై కత్తితో దాడి చేశాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు సంతోషిని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి
సాక్షి, అనకాపల్లిటౌన్(విజయనగరం) : ఎన్టీఆర్ వైద్యాలయంలో వైద్యుల నిర్లక్ష్యానికి తల్లి గర్భంలో శిశువు మృతి చెందింది. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. గర్భిణి భర్త గెంజి కొండాజీ వివరాలు ఇలా ఉన్నాయి. మాడుగుల మండలం బాధం వీధికి చెందిన గెంజి కల్యాణి పురిటి నొప్పులతో మాడుగుల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో గత నెల 30న చేరింది. ఉమ్మనీరు తక్కువగా ఉందని, తక్షణం ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీయాలని అక్కడి వైద్యులు సూచించారు. మత్తు వైద్యుడు సెలవులో ఉన్నందున అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తీసుకెళ్లాలని సూచించారు. ఆమేరకు 108లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అనకాపల్లి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేశారని కొండాజీ ఆరోపించాడు. సుఖప్రసవం అవుతుందంటూ గైనకాలజిస్ట్ చెప్పుకొచ్చారని తెలిపాడు. చి వరకు గురువారం ఉదయం ఆపరేషన్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. ఇంతలో ఇన్చార్జి గైనకాలజిస్ట్ వచ్చి సుఖప్రవసం అవుతుందంటే ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారెందుకంటూ ఇతర డాక్టర్లను ప్రశ్నించారని కొండాజీ తెలిపాడు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి కల్యాణి కడుపులో శిశువు కదలిక లేకుండా పోయింది. అప్పుడు వైద్యులు అందుబాటులో లేకుండా పోయారు. 3.30 గంటలకు విధుల్లో ఉన్న గైనకాలజిస్ట్‌కు చెప్పగా స్కానింగ్ చేసి చూశారు. శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇది తెలుసుకున్న కుటుంబసభ్యులు ఎకాయెకిన వైద్యాలయానికి చేరుకుని శిశువు మృతికి వైద్యులే కారణమంటూ ఘర్షణకు దిగారు. సమాచారంమేరకు వైఎస్సార్సీపీ నాయకుడు దాడి జయవీర్, కొణతాల మురళీ, బొడ్డేడ శివలు ఆస్పత్రికి వచ్చి ఆర్ఎంవో సింహాచలంనాయుడుతో చర్చలు జరిపారు. అనంతరం గర్భిణిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. -
ప్రదీప్ హత్యకేసులో ఐదుగురి అరెస్ట్
విశాఖపట్నం: ఇంజనీరింగ్ విద్యార్థి దానబాల ప్రదీప్ హత్య కేసులో 8 మందిపై కేసు నమోదైంది. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం డిఫెన్స్ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. గత నెల 28న మాకవరంపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న ప్రదీప్ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత నెల 28న సహచర విద్యార్థినితో కలిసి కశింకోట వద్ద ప్రదీప్ బస్సు దిగాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో కలిసి చాట్ తింటుండగా గుర్తుతెలియని దుండగులు ప్రదీప్‌ను అక్కడినుంచి లాక్కెళ్లి కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేశారు. అదే రోజు ప్రదీప్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ప్రదీప్ బంధువులు ఆందోళన చేస్తున్నారు. ప్రదీప్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
-
క్వారీ ప్రమాదంలో కూలీ మృతి
అనకాపల్లి: క్వారీ భూతం ఒకరిని బలిగొంది. మరొకరికి ప్రాణాలపైకి తెచ్చింది. అనకాపల్లి మండలంలో విచ్చలవిడిగా సాగుతున్న క్వారీ పరిశ్రమలో నిబంధనలకు తిలోదకాలివ్వడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవించడం, ప్రాణాలు హరీమనడం షరా మామూలైంది. శుక్రవారం మండలంలోని వెంకుపాలెం గ్రామం వద్ద జరిగిన క్వారీ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నందుకూర్ మండలానికి చెందిన సోమరాయి పట్నాయక్ (38) వెంకుపాలెంలో నివాసముంటున్నాడు. కార్వీలో కార్మికుడిగా రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. ఉదయం విధులలో ఉండగా క్వారీ పైనుంచి భారీ రాళ్లు పడడంతో పట్నాయక్ మృతిచెందాడు. మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. పట్నాయక్ మృతితో వెంకుపాలెంలోని అతని ఇంటి వద్ద విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో సత్తిబాబు అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అతనిని కేజీహెచ్ నుంచి ఇండస్ ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. సత్తిబాబు బవులవాడలోని త్రిమూర్తుల గుడి వద్ద నివాసముంటున్నాడు. వెంకుపాలెంకు చెందిన యజమాని క్వారీలో ఈ ప్రమాదం సంభవించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. తరచూ ప్రమాదాలు అనకాపల్లి మండలంలో క్వారీ ప్రమాదాలతో ప్రాణనష్టం కొనసాగుతూనే ఉంది. గతంలో అక్కిరెడ్డిపాలెం వద్ద బండరాయి దొర్లి పడడంతో ఒక వ్యక్తి మృతి చెందగా నష్టపరిహారం అందించే విషయంలో క్వారీ నిర్వాహకులు మొండికేశారు. మార్టూరు పరిధిలోని క్వారీలో కూడా ప్రమాదాలు సంభవించాయి. మాన్యువల్ పద్ధతికి స్వస్తి పలుకుతూ కొన్నిచోట్ల బ్లాస్టింగ్లు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో కొండ శివార్లు ప్రమాదకర కేంద్రాలుగా మారాయి. బండరాళ్లు కిందికి దొర్లడం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే క్వారీ క్రషరు అసోసియేషన్లు పుట్టుకొచ్చినప్పటికీ మృతులకు తగిన న్యాయం చేయడంలో యాజమాన్యాలతో పోరాడలేకపోతున్నాయి. అనైక్యతతో అసోసియేషన్లు తమ ఉనికిని చాటుకోలేకపోతున్నాయి. అనకాపల్లి మండలంలోని జరుగుతున్న క్వారీ ధ్వంసకాండను నిరోధించడంలో వివిధ విభాగాలకు చెందిన అధికార యంత్రాంగం విఫలమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.