
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో భారీగా అవినీతి జరుగుతోంది. తాజాగా అవినీతి డబ్బులు కోసం టీడీపీకి చెందిన రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బయటపడింది. టీడీపీ నేతలు అవినీతి డబ్బు కోసం తన్నుకున్నారు. టీడీపీలోని రెండు వర్గాలు ఇలా తన్నుకోవడంపై స్థానికులు ఆశ్చర్యపోయారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు రెండు వర్గాలు విడిపోయారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గం ఒకటి కాగా, టీడీపీ టూమెన్ కమిటీ వర్గాల మరొకటిగా విడిపోయింది. తాజాగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అవినీతి డబ్బుల కోసం తన్నుకున్నారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.