తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం | No More Private Buildings For Government Offices Universities In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

Dec 21 2025 7:13 AM | Updated on Dec 21 2025 7:42 AM

No More Private Buildings For Government Offices Universities In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను ఇక మీదట ప్రభుత్వ భవనాల్లో కొనసాగాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రైవేట్‌ భవనాల అద్దె చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది

2026 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ భవనాల్లోనే పని చేయాలని అన్ని శాఖలకు, యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్‌ భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, వర్సిటీలను వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాలకు మార్చాలని పేర్కొంది. 

డిసెంబర్ 31లోపు ప్రభుత్వ భవనాలకు షిఫ్ట్ అవ్వాలని.. అన్ని శాఖలు ప్రభుత్వ స్థలాల గుర్తింపు పూర్తిచేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాధిపతులే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని.. ఆ అద్దెలు వాళ్లే చెల్లించాల్సి వస్తుందని సర్కార్ హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement