
సాక్షి,విశాఖ: ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఫలితంగా వాతావరణ శాఖ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే మూడు రోజులు రాయలసీమలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురవునున్నాయి. ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని ప్రైవేట్,ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు మంజూరు చేస్తూ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.