ఐఆర్‌డీఏఐ చైర్మన్ అజయ్‌సేత్
ముంబై: సంస్థాగత ఆర్థిక, వాతావరణ మార్పుల రిస్క్ ను సకాలంలో గుర్తించి, చర్యలు తీసుకునేందుకు వీలుగా సమగ్రమైన కార్యాచరణను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు సంయుక్తంగా కలసి పనిచేయాలని బీమారంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) చైర్మన్ అజయ్‌సేత్ అన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ 10వ సదస్సును ఉద్దేశించిన ఆయన మాట్లాడారు.
ఆర్థిక రంగానికి సంబంధించిన సైభర్ భద్రతా రిస్క్ నిర్వహణ విధానం ముసాయిదా 2026 ఆరంభంలో ఐఆర్‌డీఏఐ ముందుకు వస్తుందని చెప్పారు. వాతావరణ సంబంధిత రిస్క్, అవకాశాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారా దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. అదే సమయంలో దేశ అభివృద్ధి ఆకాంక్షలు, ప్రాధాన్యతల విషయంలో రాజీపడరాదన్నారు. ఆర్థిక రంగంలో ఎన్నో విభాగాల మధ్య అంతర్గత అనుసంధానం పెరుగుతోందంటూ.. ఒక విభాగంలో సమస్యలు ఏర్పడితే ఇతర విభాగాల్లోనూ ఆర్థిక ఇబ్బందులు, అస్థిరతలు ఎదురవుతున్నట్టు అజయ్‌సేత్ చెప్పారు.


