ఇండస్ట్రియల్ పార్కులు, వాటర్ & వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, అర్బన్ సొల్యూషన్స్‌లో.. ప్రత్యేక నైపుణ్యం కలిగిన మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తున్న ప్రముఖ సంస్థ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. 2025లో కంపెనీ ఆపరేటింగ్ ఫండమెంటల్స్‌ను ఎలా బలోపేతం చేసింది, భవిష్యత్తు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వృద్ధి కోసం వ్యూహలు ఏమిటనే విషయాలను వెల్లడించింది.
కంపెనీ రూ. 1000 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ విధానం ద్వారా చిన్న ప్రాజెక్టులలో విభజనను తగ్గించడం, సంక్లిష్టమైన పనులపై కఠినమైన డెలివరీ నియంత్రణలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు దగ్గరగా ఉన్న అంతర్జాతీయ పైప్‌లైన్‌తో పాటు సుమారు 1 బిలియన్ డాలర్ల దేశీయ పైప్‌లైన్‌ను కూడా సూచించింది.
విదేశీ ఇండస్ట్రియల్ పార్కులు, నీటి ప్రాజెక్టులకు పరిమితం చేసిన కంపెనీ.. ఇంజనీరింగ్, నిర్మాణం, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ వంటి వాటిపై దృష్టి సారించింది. నీరు, వ్యర్థ జలాల విభాగంలో.. కంపెనీ పరిధిలో డిజైన్ బిల్డ్ ప్రాజెక్టులు, ట్రాన్స్‌మిషన్ పైప్‌లైన్‌లు, పంపింగ్ స్టేషన్లు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి.


