
రుణదాతలతో పునర్నిర్మాణ నిష్క్రమణ ఒప్పందాన్ని (రీస్ట్రక్చరింగ్ ఎగ్జిట్ అగ్రిమెంట్) అమలు చేసిన అతి కొద్ది భారతీయ కంపెనీల్లో రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒకటిగా నిలిచిందని సంస్థ తెలిపింది. దాంతో తమ కార్పొరేట్ ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నట్లు చెప్పింది. జూన్ 12, 2015న టర్మ్ లోన్‌లు, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు రెండూ కలిపి మొత్తంగా రూ.3,859.81 కోట్ల రుణాన్ని పునర్వ్యవస్థీకరణ ఒప్పందం (ఆర్ఏ) అమలులో భాగంగా పూర్తి చెల్లించాలని నిర్ణయించింది. దాంతో రీస్ట్రక్చర్ చేసిన టర్మ్ లోన్‌లను జూన్ 2019 నాటికి పూర్తిగా తిరిగి చెల్లించింది.
అనంతరం జులై 11, 2025న రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాని రుణదాతలకు అధికారికంగా ఆర్ఈఏను పూర్తిగా అమలు చేసినట్లు ప్రకటించింది. ఫలితంగా అన్ని వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాలను ఇప్పుడు రుణదాతలు రెగ్యులర్, స్టాండర్డ్‌గా వర్గీకరించారు. ఇది కంపెనీ స్థిరమైన, మెరుగైన ఆర్థిక నిర్వహణను ప్రతిబింబిస్తుందని సంస్థ పేర్కొంది. ఎటువంటి టర్మ్‌లోన్లు పెండింగ్ లేకపోవడం, పునర్నిర్మాణ చట్రం నుంచి విజయవంతంగా నిష్క్రమించడంతో రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రెడిట్ రేటింగ్‌లు, అంతర్గత బ్యాంక్ అసెస్‌మెంట్‌లను మెరుగుపరచుకుందని తెలిపింది. తద్వారా దాని మొత్తం ఆర్థిక ప్రొఫైల్‌ను బలోపేతం చేసుకుంది.
ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు
రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ వై.ఆర్. నాగరాజా మాట్లాడుతూ..‘ఆర్‌ఈఏను అమలు చేయడం కంపెనీ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది సంస్థ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వేగంగా విస్తరిస్తున్న పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల మార్కెట్‌లో వ్యూహాత్మక లక్ష్యాలను కొనసాగించేందుకు తోడ్పాటు అందిస్తుంది’ అన్నారు.