డిజిన్వెస్ట్‌మెంట్‌ @ రూ.80,000 కోట్లు | Budget 2026 Govt ambitious disinvestment target of Rs 80000 cr | Sakshi
Sakshi News home page

డిజిన్వెస్ట్‌మెంట్‌ @ రూ.80,000 కోట్లు

Feb 2 2026 8:42 AM | Updated on Feb 2 2026 8:55 AM

Budget 2026 Govt ambitious disinvestment target of Rs 80000 cr

కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ లక్ష్యం 

ఏప్రిల్‌1 నుంచి ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని  బడ్జెట్‌లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. మిస్‌లేనియస్‌ క్యాపిటల్‌ రిసీప్ట్స్‌ పేరుతో ఈ పద్దును నమోదు చేయనుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూలు)లో వాటాల విక్రయం, ఆస్తుల మానిటైజేషన్‌  చేపట్టనుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025–26) సవరించిన లక్ష్యం రూ. 34,000 కోట్లతో పోలిస్తే తాజా పద్దును రెట్టింపునకుపైగా పెంచడం గమనార్హం! అయితే కీలక రంగాలలోని కంపెనీలలో వ్యూహాత్మక నియంత్రణను నిలుపుకుంటూనే డిజిన్వెస్ట్‌మెంట్‌ చేపట్టవచ్చునంటూ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గరిష్టస్థాయిలో టార్గెట్‌ను పెట్టుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ ఏడాది సవరించిన లక్ష్యం రూ. 33,837 కోట్లుకాగా.. కేవలం రూ. 8,800 కోట్లు సమకూర్చుకోగా.. గతంలోనూ డిజిన్వెస్ట్‌మెంట్‌పై బడ్జెట్‌ ప్రతిపాదనా లక్ష్యాలు చేరుకోలేకపోయిన విషయం విదితమే.

ఇదీ చదవండి: క్యాపిటల్‌ గెయిన్స్‌గా షేర్ల బైబ్యాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement