రామ్‌కీ ఇన్‌ఫ్రాకు విశ్వకర్మ పురస్కారాలు.. | Ramky Infrastructure shines at CIDC Vishwakarma Awards | Sakshi
Sakshi News home page

రామ్‌కీ ఇన్‌ఫ్రాకు విశ్వకర్మ పురస్కారాలు..

Apr 6 2024 4:44 AM | Updated on Apr 6 2024 4:44 AM

Ramky Infrastructure shines at CIDC Vishwakarma Awards - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 15వ సీఐడీసీ విశ్వకర్మ అవార్డుల కార్యక్రమంలో వివిధ విభాగాల్లో పురస్కారాలు లభించాయి. ఉత్తమ నిర్మాణ ప్రాజెక్టులు, సామాజిక అభివృద్ధి..ప్రభావం, ప్రొఫెషనల్‌గా అత్యుత్తమంగా నడుస్తున్న సంస్థ తదితర విభాగాల్లో ఈ అవార్డులు దక్కినట్లు కంపెనీ తెలిపింది.

నిర్మాణ రంగంలో తాము పాటించే అత్యుత్తమ ప్రమాణాలకు ఇవి నిదర్శనమని రామ్‌కీ ఇన్‌ఫ్రా ఎండీ వై.ఆర్‌. నాగరాజ తెలిపారు. ప్లానింగ్‌ కమిషన్‌ (ప్రస్తుతం నీతి ఆయోగ్‌), భారతీయ నిర్మాణ పరిశ్రమ కలిసి ఏర్పాటు చేసిన కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీఐడీసీ) ఈ పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించింది.

Advertisement
 
Advertisement
Advertisement