రాంకీ ఇన్‌ఫ్రాకి రూ.1,402 కోట్ల కాంట్రాక్టు | Ramky Infra Secures MITL Contract to Build First Phase Roads | Sakshi
Sakshi News home page

రాంకీ ఇన్‌ఫ్రాకి రూ.1,402 కోట్ల కాంట్రాక్టు

Mar 6 2026 8:22 AM | Updated on Mar 6 2026 8:47 AM

Ramky Infra Secures MITL Contract to Build First Phase Roads

మౌలిక రంగ దిగ్గజం రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి తాజాగా మహారాష్ట్ర ఇండ్రస్టియల్‌ టౌన్‌షిప్‌ (ఎంఐటీఎల్‌) నుంచి భారీ కాంట్రాక్టు లభించింది. దీని విలువ రూ. 1,401.84 కోట్లని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం ఢిల్లీ ముంబై ఇండ్రస్టియల్‌ కారిడార్‌కి సంబంధించి దిఘి పోర్ట్‌ ఇండ్రస్టియల్‌ ఏరియాలో తొలి దశ కింద రహదారులు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాల పనులు చేపట్టాల్సి ఉంటుంది.

930 రోజుల్లో పూర్తి చేయాలి. 4 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్,  ప్రణాళికల అమలుకు సంబంధించి తమ సామర్థ్యాలకు ఈ భారీ కాంట్రాక్టు నిదర్శనమని రాంకీ ఇన్‌ఫ్రా సీఈవో సునీల్‌ నాయర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement