సెన్కో గోల్డ్‌ నుంచి షేప్‌ ఆఫ్‌ యూ ఏఐ అప్లికేషన్‌  | Senco Gold and Diamonds launches Shape of You AI application for Womens Day | Sakshi
Sakshi News home page

సెన్కో గోల్డ్‌ నుంచి షేప్‌ ఆఫ్‌ యూ ఏఐ అప్లికేషన్‌ 

Mar 6 2026 4:35 AM | Updated on Mar 6 2026 11:54 AM

Senco Gold and Diamonds launches Shape of You AI application for Womens Day

కోల్‌కతా: ఆభరణాల ఎంపికలో కస్టమర్లకు మరింత సహాయకరంగా ఉండేలా షేప్‌ ఆఫ్‌ యూ పేరిట ఏఐ ఫీచర్, అప్లికేషన్‌ని ప్రవేశపెట్టినట్లు సెన్కో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ వెల్లడించింది. ఇది తమ అన్ని షోరూమ్‌లతో పాటు సెన్కో యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుందని సంస్థ డైరెక్టర్‌ జోయితా సేన్‌ తెలిపారు. కస్టమర్లు తమ ముఖాకృతికి తగ్గట్లుగా ఉంటూ, తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఆభరణాలను ఎంపిక చేసుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

 మరోవైపు మహిళా దినోత్సవం సందర్భంగా 10 గ్రా.  పసిడి ఆభరణాలపై రూ. 3,000, అలాగే డైమండ్‌ ఆభరణాల మేకింగ్‌ చార్జీల్లో 75% వరకు, డైమండ్‌ విలువలో 15% వరకు, సిల్వర్‌ ఐటమ్‌ల మేకింగ్‌ చార్జీలపై 15% వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. అటు, ఆన్‌లైన్‌కి సంబంధించి మార్చి 8న (ఒక్కరోజు మాత్రమే) గోల్డ్, డైమండ్, ప్లాటినం జ్యుయలరీ మేకింగ్‌ చార్జీలపై 100 శాతం మినహాయింపు ఉంటుందని పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement