హైస్పీడ్‌లో వాహన విక్రయాలు | Indian retail auto sales jump 25. 6percent in February | Sakshi
Sakshi News home page

హైస్పీడ్‌లో వాహన విక్రయాలు

Mar 6 2026 1:27 AM | Updated on Mar 6 2026 8:05 AM

Indian retail auto sales jump 25. 6percent in February

ఫిబ్రవరిలో 26 శాతం అప్‌ 

24 లక్షలకు పైగా అమ్మకాలు 

ఫాడా వెల్లడి

న్యూఢిల్లీ: జీఎస్‌టీ క్రమబదీ్ధకరణ నేపథ్యంలో వాహన విక్రయాల జోరు ఫిబ్రవరిలోనూ కొనసాగింది.   గత నెల మొత్తం వాహనాల రిటైల్‌ విక్రయాలు 26 శాతం పెరిగి 24,09,362 యూనిట్లకు చేరినట్లు డీలర్ల సమాఖ్య ఫాడా ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో 19,17,934 యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ అమ్మకాల జోరు కొనసాగినట్లు వివరించింది. 

ఆరింట అయి దు కేటగిరీల్లో (టూవీలర్లు, త్రీ–వీలర్లు, ప్యాసింజర్‌ వాహనాలు, కమర్షియల్‌ వాహనాలు, ట్రాక్ట ర్లు) ఫిబ్రవరిలో అత్యధికంగా రిటైల్‌ సేల్స్‌ నమోదైనట్లు ఫాడా ప్రెసిడెంట్‌ సీఎస్‌ విఘ్నేశ్వర్‌ తెలిపారు. మార్కెట్లో పటిష్టమైన డిమాండ్‌ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. జీఎస్‌టీ క్రమబదీ్ధకరణతో రేట్లు తగ్గడం, పెళ్లిళ్ల సీజన్, కొత్త మోడల్స్‌ రాకతో బుకింగ్స్‌ మెరుగ్గా ఉండటంలాంటివి పరిశ్రమకు సానుకూలంగా నిల్చినట్లు వివరించారు. పంట దిగుబడులు బాగుండి గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యత మెరుగుపడటం, ఆకర్షణీయమైన మార్కెటింగ్‌ స్కీములు  కలిసి వచి్చనట్లు డీలర్లు చెప్పారు. 

ఇతర విశేషాలు.. 
→ టూవీలర్లు 25%, త్రిచక్ర వాహనాలు 24%, ప్యాసింజర్‌ వాహనాలు 26%, కమర్షియల్‌ వాహనాలు 29% అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి.  
→ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 3,13,015 యూనిట్ల నుంచి 3,94,768 యూనిట్లకు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో 21 శాతం, గ్రామీణ మార్కెట్లలో 34 శాతం వృద్ధి నమోదైంది. స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాలు, యుటిలిటీ వాహనాలే ఓవరాల్‌గా ఈ విభాగానికి దన్నుగా నిలుస్తున్నప్పటికీ, చిన్న కార్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ నెలకొనడం సానుకూలాంశం.  
→ టూవీలర్‌ విక్రయాలు 13,60,155 యూనిట్ల నుంచి 17,00,505 యూనిట్లకు పెరిగాయి. 
→ వాణిజ్య వాహనాల విభాగంలో అమ్మకాలు 78,219 యూనిట్ల నుంచి 1,00,820 యూనిట్లకు పెరిగాయి.  
→ త్రీ–వీలర్‌ సేల్స్‌ 1,17,130.. ట్రాక్టర్ల అమ్మకాలు 89,418 యూనిట్లుగా నమోదయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement