అలాంటి వాహనాలు రోడ్డుపై కనిపిస్తే తుక్కుకే! | Delhi Govt To Impound And Scrap Overaged Vehicles | Sakshi
Sakshi News home page

అలాంటి వాహనాలు రోడ్డుపై కనిపిస్తే తుక్కుకే!

Feb 21 2026 5:28 PM | Updated on Feb 21 2026 7:00 PM

Delhi Govt To Impound And Scrap Overaged Vehicles

లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో నడిపే లేదా పార్క్ చేసిన పాత పెట్రోల్ & డీజిల్ వాహనాలను నోటీసు లేకుండా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.

బీఎస్ III అంతకంటే పాత వాహనాలు, అంటే.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన డీజిల్ వాహనాలు & 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పెట్రోల్ వాహనాలను లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలుగా పరిగణిస్తారు. ఇలాంటి వాహనాలను పబ్లిక్ రోడ్డుపై డ్రైవ్ చేయకూడదు.

కాలం చెల్లిన వాహనాలను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందటం ద్వారా.. ఢిల్లీ వెలుపలికి తీసుకెళ్లవచ్చు. రూల్స్ అతిక్రమించి.. బహిరంగ ప్రదేశాల్లో పాత వాహనాలను నడిపినట్లయితే.. వాటిని అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని స్క్రాపేజ్ చేయడానికి తరలించడం జరుగుతుంది. కాలం చెల్లిన వాహనాలను గుర్తించడానికి కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది.

ఇదీ చదవండి: ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం

పాత వాహనాలు ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీలు కూడా కార్లలో ఇంజిన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీఎస్ 4, బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు బీఎస్ 6 వాహనాలే అందుబాటులో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement