త్రిసూర్: కేరళలోని త్రిసూర్ రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200కి పైగా బైక్‌లు దగ్ధమయ్యాయి. స్టేషన్‌కు అనుకుని ఉన్న పెయిడ్-పార్కింగ్ ప్రదేశంలో ఇవాళ ఉదయం(ఆదివారం జనవరి 4) 6.45 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కరెంట్ తీగ బైక్‌లపై తెగిపడడంతో మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ప్లాట్‌ఫాం నంబర్ 2 సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో జరిగింది.
నిత్యం పార్కింగ్ షెడ్‌లో 500కిపైగా వాహనాలు పార్కింగ్ చేస్తారు. వాహనాల్లోని ఇంధనం కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో కొన్ని నిమిషాల్లోనే తీవ్ర నష్టం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, సుమారు అరగంటలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తమ వాహనాలు బూడిదగా మారిన దృశ్యం చూసి యజమానులు షాక్‌కు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు నిర్థారణ కాలేదు.
Thrissur, Kerala: A massive fire broke out at Thrissur Railway Station. The blaze originated in the bike parking area near the station’s rear entrance, destroying several motorcycles. Preliminary reports indicate that more than 600 bikes were parked in the affected area pic.twitter.com/XQoSURUtUB
— IANS (@ians_india) January 4, 2026
ఈ ప్రమాదం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఇంధన లీక్, ఇతర కారణాల వల్ల జరిగిందా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ఘటన రైలు సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. గురువాయూర్ వైపు వెళ్లే ట్రాక్‌కు సమీపంలోనే పార్కింగ్ ప్రదేశం ఉన్నప్పటికీ, సమయానికి చర్యలు తీసుకోవడంతో రైల్వే మౌలిక వసతులకు మంటలు వ్యాపించలేదు. రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.


